ఆ సినిమా ఫ్లాప్‌ తో చావాలనుకున్నాడట

Update: 2021-07-29 06:43 GMT
దర్శకుడు అయినా హీరో అయినా ఒక సినిమాను చేసే సమయంలో లైఫ్‌ అండ్ డెత్ అన్నట్లుగా ప్రాణం పెట్టి మరీ చేస్తారు. ప్రతి ఒక్క సినిమా కూడా దర్శకుడు హీరో కు మాత్రమే కాకుండా ఆ సినిమా కు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా కెరీర్‌ లో చాలా కీలకం. అందుకే సినిమాపై చాలా అంచనాలు పెట్టుకుని చేస్తారు. ముఖ్యంగా కెరీర్‌ ఆరంభంలో చాలా అంచనాలు పెట్టుకుని సినిమాలు చేసిన సమయంలో ఆ సినిమా ప్లాప్ అయితే జీవితం పైనే విరక్తి పుట్టడం మాత్రమే కాకుండా కొందరు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిన సందర్బాలు చాలా ఉన్నాయి.

కొందరు సినిమాలపై ఆసక్తిని వదిలేసి ఏదో ఒక జాబ్‌ చేసుకోవడానికి వెళ్లిన వారు కూడా ఉన్నారు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ రాకేష్‌ ఓమ్‌ ప్రకాష్‌ మెహ్రా తాను చాలా ఆశలు పెట్టుకుని తీసిన సినిమా ప్లాప్ అవ్వడంతో బాగా మద్యంకు బానిస అయ్యి ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన బయోగ్రపీలో పేర్కొన్నాడు.

అభిషేక్ బచ్చన్‌ హీరోగా సోనమ్‌ కపూర్‌ హీరోయిన్ గా రాకేష్‌ ఓమ్‌ ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఢిల్లీ 6' సినిమా 2006 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెల్సిందే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సినిమా షూటింగ్‌ సమయంలోనే అద్బుతంగా సినిమా ఉంటుందనే నమ్మకంను అంతా ప్రచారం చేశారు. అదే సమయంలో ఏఆర్‌ రహమాన్‌ సంగీతం సినిమా పై అంచనాలు మరింతగా పెరిగింది. సినిమా మ్యూజికల్‌ హిట్‌ అవ్వడంతో మరింతగా అంచనాలు పెట్టుకోగా సినిమా పూర్తిగా నిరాశ పర్చింది.

అంచనాలను ఢిల్లీ 6 సినిమా అందుకోలేక పోవడంతో ఒక్కసారిగా అంతా షాక్ కు గురయ్యారు. అభిషేక్‌ బచ్చన్‌ మరియు సోనమ్‌ కపూర్‌ లు ఆ వెంటనే బిజీ అయినా కూడా దర్శకుడు రాకేష్‌ ప్రకాష్‌ మాత్రం డిప్రెషన్‌ కు గురయ్యాడట. ఆయన ప్లాప్ ను జీర్ణించుకోలేక మద్యంకు బానిస అయ్యాడు. ఆ సమయంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల వల్ల తాను డిప్రెషన్‌ నుండి బయట పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News