కోలీవుడ్ పాన్ ఇండియా అయ్యేది ఇంకెప్పుడు?

Update: 2022-05-11 00:30 GMT
తెలుగు సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెక్క‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్..రామ్ చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్..అల్లు అర్జున్ లు పాన్ ఇండియా హీరోలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. త్వ‌ర‌లో ఈ వ‌రుస‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేర‌నున్నారు. అటుపై రాజ‌మౌళి ఏ హీరోతో ప‌నిచేస్తే ఆ హీరో ఆ కేట‌గిరిలో  చేర‌తాడన్న‌ది వాస్త‌వం. పాన్ ఇండియా కంటెంట్ తో సినిమా చేసి కోట్లు కొల్ల‌గొట్ట‌డ‌మే రాజ‌మ‌ళి టార్గెట్.

ఆయ‌న కార‌ణంగానే పాన్ ఇండియాలో తెలుగు నుంచి ఇంత మంది హీరోలు ఫేమ‌స్ అయ్యారు. మ‌రింత మంది మేక‌ర్స్..స్టార్స్  పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాతో ముందుకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక 'కేజీఎఫ్' హిట్ తో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ పేరు దేశం మొత్తం మారు మ్రోగిపోతుంది. అంద‌కు ప్ర‌శాంత్ నీల్-య‌శ్ లాంటి వారు  మార్గం వేస్తే..ఇప్పుడా దారిలో మ‌రింత మంది న‌డ‌వ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇక మ‌ల‌యాళం  ఇండ‌స్ర్టీ  కూడా మేమేం త‌క్కువ కాదంటూ ప‌దే ప‌దే ప్రూవ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది.  'మ‌ర‌క్క‌ర్' లాంటి సినిమా ని వంద‌ల కోట్లు వెచ్చించి పాన్ ఇండియా లో రిలీజ్ చేసారు. ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఓ ప్ర‌య‌త్న‌మైతే జ‌రిగింది. అలాగే ఇటీవలి కాలంలో అక్క‌డ సినిమాల  స‌క్సెస్ రేటు ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మాలీవుడ్ కంటెంట్ తెలుగు కి రీమేక్ రూపంలో  డంప్ అవుతుంది.

అయితే కోలీవుడ్ హీరోలు మాత్రం ఇంకా పాన్ ఇండియా వైపు చూడ‌లేదు. మ‌ల్టీ లింగ్యువ‌ల్ గా త‌మ సినిమాల్ని రిలీజ్  చేస్తున్నారు త‌ప్ప‌.... పాన్ ఇండియా కేట‌గిరిపై క‌న్నేయ‌లేదు. అనువాద రూపంలో వ‌చ్చిన సినిమాల్ని కూడా పెద్దగా ప్ర‌మోట్ చేయ‌డం లేదు. ఇటీవ‌లే విజ‌య్ హీరోగా వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ప్రారంభ‌మైంది.

ఇది కేవ‌లం తెలుగు..త‌మిళ్ భాష‌ల‌కే ప‌రిమితం. అలాగే శేఖ‌ర్ క‌మ్ములా కూడా ధ‌నుష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రెండు భాష‌ల‌కే  అంకితం. సూర్య‌...కార్తి..విక్ర‌మ్ లాంటి వారిలో పాన్ ఇండియాలో ఆలోచ‌న కూడా క‌నిపించ‌లేదు. విక్ర‌మ్ కి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కానీ ఎందుక‌నో సాహ‌సించ‌లేదు. వీళ్లంద‌రిలో కాస్త మెరుగ్గా ఉన్న‌ది ధ‌నుష్ ని చెప్పొచ్చు.

కోలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అప్పుడ‌ప్పుడు హిందీలో కూడా సినిమాలు చేస్తూ మార్కెట్ ని బిల్డ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. 'రాంజాన్' లాంటి సినిమా అత‌నికి హిందీలో మంచి పేరు తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్..విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌కు  పాన్ ఇండియా లో క్రేజ్ ఉన్నా ఆ త‌ర‌హా కంటెంట్  విష‌యంలో అశ్ర‌ద్ద చూపిస్తున్నారు. ఆ ర‌కంగా కోలీవుడ్ మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల‌కంటే వెనుక‌బ‌డి ఉంద‌న్న విమ‌ర్శ వినిపిస్తుంది.
Tags:    

Similar News