పుష్ప త‌ర్వాత పాన్ ఇండియా ఆడియో బెస్ట్ ఏదీ?

Update: 2022-03-14 03:51 GMT
సినిమాల‌ జ‌యాప‌జ‌యాల్లో ఆడియో పాత్ర అంతా ఇంతా కాదు. పాట‌లు హిట్ట‌యిన మెజారిటీ సినిమాలు హిట్లు కొట్టాయి. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు పాట‌లు - సంగీతం చాలా ఇంపార్టెంట్ అని భావిస్తారు. అందుకే సినిమా మొద‌లు కాక‌ముందే ఆడియో సిట్టింగ్స్ పాట‌ల రికార్డింగ్ అంటూ హ‌డావుడి మొద‌ల‌వుతుంది. చాలా మంది పెద్ద ద‌ర్శ‌క‌నిర్మ‌త‌లు ఆడియో పైనే ఎక్కువ స‌మ‌యం దృష్టి సారిస్తున్నారు.

ఇక ఇటీవ‌లి కాలంలో పుష్ప-1 ఆడియో సృష్టించిన హైప్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ విజ‌యంలో ఆడియో స‌గం పాత్ర పోషించింది అంటే అతిశ‌యోక్తి కాదు. ఇందులో శ్రీ‌వ‌ల్లీ సాంగ్ అయితే వ‌ర‌ల్డ్ వైడ్ సెన్సేష‌న్ గా మారింది. దీనిని వ‌ర‌ల్డ్ సినీ సెల‌బ్రిటీలు అనుక‌రించారు. అంతేకాకండా ప్ర‌ముఖ క్రికెట‌ర్లు కూడా శ్రీ‌వ‌ల్లీ ల్యాండ్ మార్క్ స్టెప్ ని అనుక‌రించారు. అయితే బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో ఆడియో ప‌రంగా హైప్ వ‌చ్చింది మాత్రం పుష్ప‌కే. ఇదంతా దేవీశ్రీ ప్ర‌సాద్ మ‌హ‌త్మ్యం అని చెప్పాలి. అత‌డు మ‌న‌సు పెడితే ఆడియో క్వాలిటీ ఆ రేంజులో ఉంటుంది. ఇంత‌కుముందు బాహుబ‌లి ఆడియో స‌క్సెస్ వెన‌క మ‌ర‌క‌త‌మ‌ణి కీర‌వాణి ఉన్నారు. బాహుబ‌లికి భారీ హైప్ ని తేవ‌డంలో ఆడియో పాత్ర చాలా ఉంది. ఆ త‌ర్వాత పుష్ప‌కే అంత‌గా వ‌ర్క‌వుటైంది. ఇత‌ర పాన్ ఇండియా సినిమాలు ఎన్ని విడుదలైనా కానీ దేనికీ అంత‌గా ఆడియో వ‌ర్క‌వుట్ కాలేద‌నే చెప్పాలి.

ఇక‌పోతే పుష్ప1 త‌ర్వాత రిలీజ‌వుతున్న అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ మూవీ ఆడియో సాంగ్స్ కొంత వ‌ర‌కూ హైప్ తెచ్చాయి. కానీ ఇవి ప్ర‌మోష‌న‌ల్ సాంగ్స్ గా మాత్ర‌మే క‌నిపించాయి. అలాగే మూవీలో పాట‌లకు అధిక ప్రాధాన్య‌త‌ లేక‌పోవ‌డం కొంత‌వ‌ర‌కూ దానిపై చ‌ర్చ లేకుండా చేసింది. దోస్తీ .. నాటు నాటు.. రామం రాఘ‌వం .. సాంగ్స్ కొంత‌వ‌ర‌కూ హైప్ ని తెచ్చాయ‌నే చెప్పాలి. ఈ ఏడాది చివ‌రిలో విడుద‌ల కానున్న పుష్ప 2 తో రాక్ స్టార్ దేవీశ్రీ‌ మ‌రో బంప‌ర్ హిట్ ఆల్బ‌మ్ ని పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌ర్క‌వుట్ చేస్తాడ‌నే భావిస్తున్నారు. ఈలోగానే చాలా పాన్ ఇండియా సినిమాలు విడుద‌ల‌వుతాయి. వీటిలో ఆడియో ప‌రంగా హైప్ తెచ్చుకునేది ఏదో చూడాలి.
Tags:    

Similar News