సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమా తీస్తున్నారు అంటే అందరి కళ్లు అటువైపే ఉంటాయి. భారీ బడ్జెట్లు.. అసాధారణ కాన్వాసుతో గ్రాండియర్ గా సినిమాలు తీయడం ఆయన శైలి. అంతకుమించి సామాజిక సమస్యల్ని తనదైన పంథాలో కమర్షియల్ పంథాలో తెరపై ఎలివేట్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే శంకర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో కలలు గంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకూ శంకర్ ఒక్క తెలుగు హీరోతో కూడా సినిమా తీయలేదు. మెగాస్టార్ చిరంజీవి .. సూపర్ స్టార్ మహేష్ అతడి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రకటించినా ఎందుకనో ఆ ప్రాజెక్టు కుదరలేదు.
శంకర్ పూర్తిగా తమిళ స్టార్లతోనే చేస్తున్నారు. రజనీకాంత్ - కమల్ హాసన్- విక్రమ్- అర్జున్ లాంటి వారితో మాత్రమే సినిమాలు తీస్తున్నారు. అయితే ఈసారి మాత్రం శంకర్ దృష్టి ఆ నలుగురి పై నుంచి మరలినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ కథానాయకుడిగా `భారతీయుడు 2` ని శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ రకరకాల కారణాలతో వాయిదాల పద్ధతితో తెరకెక్కడం ఇటీవల చర్చకొచ్చింది. అదంతా అటుంచితే తాజాగా శంకర్ మరో సీక్వెల్ సినిమా గురించి అంతే సీరియస్ గా ఆలోచిస్తున్నారట. ఆ క్రమంలోనే ఇలయదళపతి విజయ్ హీరోగా `ఒకే ఒక్కడు`(ముదల్వన్) సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం దిల్లీలో `బిగిల్` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ కి శంకర్ స్వయంగా వెళ్లి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దళపతి నటిస్తున్న 63వ చిత్రం బిగిల్.. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి 64 తెరకెక్కుతుంది. తదుపరి శంకర్ దర్శకత్వంలో దళపతి 65 కి సన్నాహాలు చేస్తారట. `ఒకే ఒక్కడు 2 `(ముదల్వన్ 2) కథను విజయ్ కి వినిపించేందుకు శంకర్ కలిసారన్న ముచ్చటా సాగుతోంది. వాస్తవానికి `ఒకే ఒక్కడు`లో విజయ్ నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో అర్జున్ తో ఆ చిత్రం తెరకెక్కించారు.
ఇప్పుడు సీక్వెల్ లో ఛాన్స్ ని దళపతి విజయ్ మిస్ చేసుకోరనే అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు శంకర్ ఏదైనా కథ వినిపిస్తే ఓకే చెప్పేందుకు టాలీవుడ్ లోనూ మహేష్ లాంటి స్టార్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇటీవల మహర్షి ఇంటర్వ్యూలోనూ శంకర్ తో ప్రాజెక్ట్ గురించి మహేష్ ప్రస్థావించారు. కథ కుదిరితే చేస్తానని అన్నారు. మరి `ఒకే ఒక్కడు` ఛాయిస్ కేవలం దళపతి విజయ్ కేనా..? మహేష్ కి లేదంటారా? మెగాస్టార్ చిరంజీవి సైతం శంకర్ తో సినిమా చేయాలని ఆసక్తిగానే ఉన్నారు కదా!! జస్ట్ వెయిట్.. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.