సీనియర్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్రహ్మానందంకు జోడీగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుని.. వందల కొద్ది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సురేఖ వాణి ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. ఈమె సందడి అంతా కూడా సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ సమయంలో సురేఖ వాణి నటించిన స్వాతిముత్యం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన స్వాతిముత్యం సినిమాలో సురేఖ కి మంచి పాత్ర దక్కింది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ ను తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేఖ వాణి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. తాను సినిమాల్లో నటించడం లేదు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. తాను సినిమాల్లో ఉన్నాను.. మంచి ఆఫర్స్ కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాను అంది.
నా వరకు కొన్ని ఆఫర్లు రావడం లేదు.. అది ఎందుకో అనే విషయం నాకు తెలియదు అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అంటూ చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. సురేఖ వాణి కి ఆఫర్లు రాకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా అంటూ ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చ మొదలు అయ్యింది.
ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు లోతుగా విశ్లేషించి మరీ ఆమె కెరీర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉందని.. ఆమె కు ఇప్పుడు ఆఫర్లు కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సురేఖ వాణి యొక్క విషయం ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. ఇక సురేఖ వాణి కూతురు ఆ మధ్య నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.