ట్రయాంగిల్ వార్ లో విజేత ఎవరు ?

Update: 2019-06-26 07:23 GMT
ఈ శుక్రవారం మరో బాక్స్ ఆఫీస్ పోరుకు రంగం సిద్ధమవుతోంది. పోయిన వారం ఏకంగా ఆరు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వస్తే అందులో కేవలం రెండు మాత్రమే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఒకటే కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ట్రేడ్ ని ఏమంత ఉత్సాహపరచలేదు. అందుకే ఇప్పుడు రాబోయే మూడు సినిమాల మీద మంచి అంచనాలే ఉన్నాయి. మొదటిది కల్కి. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ పై ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. మంచి ఇంటెన్సిటీతో డిఫరెంట్ టేకింగ్ తో ఇది రూపొందిందన్న ప్రీ పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. గరుడవేగా తర్వాత రాజశేఖర్ చేసిన మూవీ ఇది.

ఇక రెండోది అది సాయి కుమార్ హీరోగా డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన బుర్రకథ. హాస్య చిత్రాల రచయితగా గుర్తింపున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ట్రైలర్ ని బట్టి ఇది ఎంటర్ టైన్మెంట్ జానర్ అని చెప్పేశారు. సవ్యసాచి తరహా లైన్ తో రూపొందిందన్న కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి దీటుగా బదులివ్వాలంటే కంటెంట్ చాలా సాలిడ్ గా ఉండాలి. ఇది టాక్ మీద ఆడాల్సిందే తప్ప హీరో ఇమేజ్ మీద మార్కెట్ అయ్యింది కాదు

ఇక మూడోది బ్రోచేవారెవరురా. శ్రీవిష్ణు హీరోగా నివేదా థామస్ హీరోయిన్ గా రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి-సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో నివేత పేతురాజ్ ఇంకో ఇంపార్టెంట్ రోల్ చేసింది. యూత్ ఫుల్ అండ్ డిఫరెంట్ ఎంటర్ టైనర్ అనే ఫీలింగ్ అయితే ట్రైలర్ లో కలిగించారు. మెంటల్ మదిలో దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండో సినిమా ఇది. ఓపెనింగ్స్ మీద కాకుండా మౌత్ టాక్ తో పికప్ అవ్వాల్సిన ఈ మూవీ సైతం యువతతో పాటు ఫామిలీస్ ని టార్గెట్ చేసింది. ఈ మూడు సినిమాల ట్రయాంగిల్ వార్ లో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు ఇంకో 48 గంటల్లో తేలిపోతుంది

    
    
    

Tags:    

Similar News