టాలీవుడ్ ఇప్పుడిపుడే బిజినెస్ లో బాలీవుడ్ తో పోటీ పడుతోంది. మొన్నటి వరకు తమ సినిమాలే పెద్దవి అనుకునే కోలీవుడ్ కి కూడా టాలీవుడ్ గట్టి పోటీని ఇస్తోంది. అలాగే సరికొత్త సినిమాలతో టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు ప్రశంసలను అందిస్తున్నారు. అయితే ఆ దిష్టి గట్టిగా తగిలిందో ఏమో మరి బాహుబలి రికార్డులు కొట్టినప్పుడు పట్టించుకోని జాతియా మీడియాలు టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కథనాలను ప్రసారం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి వివాదం ఏ స్థాయిలో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా అసోసియేషన్ ఆమెపై వేటు వేసిన తరువాత ఇష్యు మరింత పెద్దదైంది. దీంతో టాలీవుడ్ పరువు పోతుందో ఏమో అని పరువు పోయిన తరువాత ఆమెపై నిషేధం ఎత్తేసింది. అయితే మొన్న శ్రీ రెడ్డిపై అంతలా ఆగ్రహం వ్యక్తం చేసిన మా ఇప్పుడు సడన్ గా ఎందుకు వెనక్కి తగ్గింది అనే ఊహాగానాలు చాలానే వస్తున్నాయి.
పెద్దలు చెప్పిన కారణంగా వెనక్కి తగ్గినట్లు మా అధ్యక్షుడు శివాజీరాజా ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే 900 మంది సభ్యులు ఉన్న మా కమిటీని శాసించగల వ్యక్తి ఎవరయ్యుంటారు అనే విషయంపై పలువురి ప్రముఖుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దిల్ రాజ్ - అల్లు అరవింద్ అలాగే సురేష్ బాబు వంటి నిర్మాతలు ఇండస్ట్రీలో బలమైన పలుకుబడి ఉన్నవారు. ఇక మెగాస్టార్ లాంటి వారు సహాయం అడిగినప్పుడు అండగా ఉంటారు. మరి ఇంత మంది పెద్దలో మా పెద్ద ఎవరై ఉంటారు?