మ‌హానటి కావాల్సింది జ‌స్ట్ మిస్

Update: 2019-07-17 06:30 GMT
కొన్ని అవ‌కాశాలు అరుదుగానే ఇంటి త‌లుపు త‌డ‌తాయి. అలాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటే దాని ప‌ర్య‌వ‌సానం లైఫ్ మీద ఉంటుంది. అయితే అలాంటి అరుదైన అవ‌కాశాన్ని వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌ల వ‌ల్ల కోల్పోయాన‌ని అంగీక‌రించింది అమ‌లాపాల్. ఇంత‌కీ ఏమా అవ‌కాశం? ఎందుకు మిస్ చేసుకుంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్సర్స్ ఇవిగో..

కీర్తి సురేష్ క‌థానాయిక‌గా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ నిర్మించిన `మ‌హాన‌టి` సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. లెజెండ్ సావిత్రి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిన ఈ బ‌యోపిక్ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే గాక టైటిల్ పాత్ర‌ధారి కీర్తి సురేష్ కి ఎన‌లేని గౌర‌వం- గుర్తింపు తెచ్చి పెట్టింది. వాస్త‌వానికి ఈ పాత్ర‌లో తొలి ఛాయిస్ ఎవ‌రిది? అంటే ఓ కొత్త సంగ‌తి తాజాగా రివీలైంది. ఈ సినిమాలో టైటిల్ పాత్ర కోసం అప్ప‌ట్లో వైజ‌యంతి టీమ్ ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలించింది. అందులో నిత్యామీన‌న్ పేరు కూడా ప్ర‌ముఖంగానే వినిపించింది. అయితే వీళ్లెవ‌రూ తొలి ఆప్ష‌న్ కానేకాద‌ని అమ‌లాపాల్ తాజాగా `ఆమె` (ఆడై) ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

``జ‌రిగిందే చెబుతున్నా. మ‌హాన‌టి సావిత్రి పాత్ర కోసం నాగ్ అశ్విన్ టీమ్ న‌న్ను సంప్ర‌దించారు. అయితే అప్ప‌టికి వ్య‌క్తిగ‌త (విడాకుల ఫ‌ర్వం) కార‌ణాల వ‌ల్ల వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌``ని అమ‌లాపాల్ ఆ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత‌నే ప‌లువురిని ప‌రిశీలించి చివ‌రికి కీర్తి సురేష్ ని ఫైన‌ల్ చేసి ఫోటోషూట్లు చేశారట‌. ఒక‌వేళ సావిత్రి పాత్ర‌లో అమ‌లా పాల్ కే అవ‌కాశం వ‌చ్చి ఉంటే వంద శాతం న్యాయం చేయ‌గ‌లిగి ఉండేదా? అంటే .. ఈ ప్ర‌తిభావ‌ని కూడా మెప్పించి ఉండేదే. అయితే ఊహించ‌ని అదృష్టం కీర్తి సురేష్ ని వ‌రించింది. ఆ పాత్ర త‌న‌కే రాసి పెట్టి ఉంద‌ని భావించాల్సి ఉంటుంది. అమలాపాల్ బోల్డ్ గా న‌టించిన ఆమె ఈ నెల 19న రిలీజ‌వుతోంది.

    

Tags:    

Similar News