సైలెంట్ అయిపోయిన క్రాక్ ప్రొడ్యూస‌ర్..!

Update: 2022-01-05 00:30 GMT
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవితో 'ఠాగూర్' చిత్రాన్ని నిర్మించి అదే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు ప్రొడ్యూసర్ మధు. ఆ తర్వాత 'గజినీ' 'స్టాలిన్' 'టైగర్' 'మిస్టర్' 'విన్నర్' 'స్పైడర్' 'కాంచన 3' వంటి చిత్రాలను నిర్మించారు. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌ పై గతేడాది ''క్రాక్'' సినిమాని నిర్మించి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఠాగూర్ మధు. అయితే హిట్ సినిమా తీసి ఏడాది కావొస్తున్నా నిర్మాత ఇంకా మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌లేదు.

మాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ''క్రాక్'' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 2021 సంక్రాంతి సీజన్‌ లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీలోనూ భారీ విజయాన్ని నమోదు చేసింది. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా.. నిర్మాతగా ఠాగూర్ మధుకు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా నిలిచింది.

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయిందంటే.. వెంటనే స్టార్ హీరోలు - దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి అదే బ్యానర్ లో వరుస సినిమాలు లైన్ లో పెడుతూ ఉంటారు. అయితే భారీ హిట్ కొట్టిన తర్వాత పూర్తిగా కూడా ఠాగూర్ మధు సైలెంట్ అయిపోవడం గమనార్హం. తమిళ నిర్మాతలతో ఉన్న ఆర్ధికపరమైన లావాదేవీల కారణంగా 'క్రాక్' సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించడంతో అనుకోని విధంగా మధు వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో రిలీజ్ రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు క్యాన్సిల అవడం రవితేజ ఫ్యాన్స్ మరియు సినీ ప్రేక్షకులు అసహనానికి గురి చేసింది.

అలానే 'క్రాక్' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన రూ.12 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ లో ఫిర్యాదు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగానే ఇదంతా జరిగిందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి సైలెంటుగా ఉంటూ వస్తున్న మధు.. ఓ భారీ ప్రాజెక్ట్ కు ప్లాన్ చేస్తున్నార‌ని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

యూత్ స్టార్ నితిన్ -  రైటర్ కమ్ డైరెక్టర్ వ‌క్కంతం వంశీ కాంబినేషన్ లో ఠాగూర్ మధు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారని చెప్పుకుంటున్నారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వివ‌రాలు అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News