సాయిధరమ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ అతడి పేరు మార్చేశారు ఎందుకో! చాలా కాలంగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడంటూ మాట్లాడుకున్న మెగాభిమానులే ఈ మార్పు వల్ల చాలానే కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఉన్నట్టుండి 'పంజా వైష్ణవ్ తేజ్' అంటూ కొత్తగా పరిచయం చేసారు సుకుమార్. సుకుమార్ రైటింగ్స్ - మైత్రి మూవీ మేకర్స్ టీమ్స్ అతడిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఆలోచన ఎవరిది? ఎందుకు వైష్ణవ్ ముందు 'పంజా' అన్న పదం వేశారు? అన్న సందేహాలు అభిమానులకు కలిగాయి. నానక్ రామ్ గూడ లోని సినిమా ప్రారంభోత్సవం వేళ అభిమానులు ఈ విషయంపై ఆసక్తిగా చర్చించుకున్నారు. అసలింతకీ వైష్ణవ్ ఇంకా తెరపైకి రాక ముందే `పంజా` అన్న బిరుదును ఎందుకు అంకితమిచ్చారు? ఇది ఎవరి ఆలోచన? అంటూ మాట్లాడుకున్నారు.
అయితే సుకుమార్ మాటల్ని బట్టి వైష్ణవ్ తేజ్ పోలిక, ఆలోచనా శైలి అచ్చం మేనమామ పవన్ కల్యాణ్ తరహాయేనట. `పంజా` అని పేరు ముందు ప్రస్థావించడానికి కారణం అతడిలో మేనమామ పవన్ కల్యాణ్ పోలికలు ఎక్కువగా ఉండడమేనని చెప్పుకున్నారు. వైష్ణవ్ లోని క్వాలిటీస్ గురించి సుకుమార్ మాట్లాడుతూ ప్రత్యేకించి నొక్కి మరీ చెప్పాడు.. అతడి కళ్లు.. వ్యవహార శైలి.. లక్షణాలు అన్నీ పవన్ కల్యాణ్ పోలికలే.. ``వైష్ణవ్ నీకు చాలా మంచి భవిష్యత్ ఉంది. ఇంట్లో అందరూ చెబుతున్నారు కల్యాణ్ లక్షణాలు నీకే ఉన్నాయట. ఎలాంటి భేషజాలు, ఈగో లేని కుర్రాడు అని చెప్పారు. సింప్లిసిటీ ఉన్న హీరో .. నీకు చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా`` అని అన్నారు సుకుమార్.
సుక్కూ శిష్యుడు, దర్శకుడు బుచ్చిబాబు కథ రాసుకున్న తర్వాత అసలు నీ హీరో ఎవరు? అని సుకుమార్ ప్రశ్నిస్తే.. రోజూ వైష్ణవ్ ఫోటోలనే బుచ్చిబాబు చూపించేవాడట. కథే వైష్ణవ్ ని ఎంచుకుంది. తన ట్యాలెంట్ (ఆడిషన్స్ చేశాక)తోనే ఈ కథకు కుదిరాడు... అని సుకుమార్ కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ అంత సింప్లిసిటీ వైష్ణవ్ కి ఉందని కాంప్లిమెంట్ ఇచ్చాడు సుకుమార్. వైష్ణవ్ ఎక్కడన్నా సింపుల్ గా అందరితో కలిసిపోతాడు. రోడ్ మీద అయినా కూచుని తింటాడు. అలాంటి సింప్లిసిటీ ఉంది... అని తన లక్షణాల్ని పవన్ తో ముడిపెడుతూ పొగిడేశాడు సుకుమార్. ఇక మెగా కాంపౌండ్ లో సాయి ధరమ్ తేజ్ ఎంతో సింప్లిసటీతో ఉంటారు. తనకి కూడా పవన్ కల్యాణ్ స్ఫూర్తి. ఇప్పుడు రెండో మేనల్లుడు కూడా పవన్ తరహాలోనే సింప్లిసిటీతో ఆకట్టుకుంటున్నాడన్న కితాబు అందుకున్నాడు. ఇక పెద్ద తెరపై ట్యాలెంట్ చూపించడమే మిగిలి ఉంది.