కొత్త ట్రెండ్ :'జాతిరత్నాలు' కు రివర్స్ 'వైల్డ్ డాగ్'

Update: 2021-04-26 09:02 GMT
చూస్తూంటే ఓటీటి మార్కెట్, థియోటర్ మార్కెట్ రెండుగా వేర్వేరుగా కనపడుతున్నాయి. థియోటర్ లో ఆడిన సినిమాలు ఓటీటిలో అబ్బే అనిపించుకుంటే...థియోటర్ లో ఫ్లాఫ్ అయిన సినిమా ఓటీటిలో పెద్ద హిట్ అవుతున్నాయి. అంటే ఓటీటి ఆడియన్స్ వేరు..థియోటర్ ఆడియన్స్ వేరు అని అర్దమైపోతోంది. ఓటీటిలో క్రైమ్,థ్రిల్లర్స్ వంటివి బాగా వర్కవుట్ అవుతున్నాయి. థియోటర్ లో మాస్ కు నచ్చే ఎలిమెంట్స్ తో ఉన్న సినిమాల ఆడుతున్నాయి. అయితే రెండు చోట్లా ఆడే సినిమాలు వేరేగా ఉంటున్నాయి. ఇప్పుడీ టాపిక్ ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో రిలీజైన రెండు సినిమాలకు రిజల్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన జాతిరత్నాలు సినిమా థియోటర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాని ఓటీటిలో చూసిన వారంతా పెదవి విరిచారు. అదేంటి ఓటీటిలో వచ్చినప్పుడు చూసినప్పుడు ఇంత పెద్ద హిట్ సినిమా కదా  అని హై ఎక్సపెక్టేషన్స్ తో చూసారో ఏమో కానీ  సినిమా కథలేదు..ఆ జోక్ లకు నవ్వురాలేదు అంటున్నారు. అదే సీన్ వైల్డ్ డాగ్ కు రివర్స్ అయ్యింది.

ఏప్రిల్ 2న రిలీజైన ‘వైల్డ్డ్ డాగ్’కు ఫ్లాఫ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ అయితే అసలు లేనేలేవు. టోటల్ రన్ పూర్తయ్యేసరికి మూడు కోట్లు మాత్రమే తెచ్చుకుని షాక్ ఇచ్చింది. కరోనా వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పుకున్నా..ఆ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ అదరకొట్టింది. దాంతో వైల్డ్ డాగ్ సినిమా కంటెంట్ లో సత్తాలేదని తేల్చేసారు. కానీ చిత్రంగా ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైతే జనం తెగ చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆల్ ఇండియా  ట్రెండ్ అవుతోందీ సినిమా.

దాంతో ఇక నుంచి సినిమా చేసేటప్పుడే ఇది ఓటీటి సినిమానా లేక థియోటర్ సినిమానా లేక రెండు చోట్లా ఆడేదా..లేక రెండు చోట్లా కూడా తేడా కొట్టే సినిమానా అనేది తేల్చుకోవాల్సిన పరిస్దితి. లాస్ట్ ఇయిర్ వచ్చిన ‘పలాస 1978’, ‘రాజావారు రాణి వారు’ వంటి సినిమాలు థియోటర్ లో తేడా కొట్టినా ఓటీటిలో అదరకొట్టాయి.
Tags:    

Similar News