'బ్ర‌హ్మాస్ర్త -2' తీస్తారా? లేక‌ ప‌బ్లిసిటీ స్టంట్?

Update: 2022-07-20 02:30 GMT
ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ జంట‌గా ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌` బ్ర‌హ్మాస్ర` మొద‌టి భాగం రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముంబై స‌హా హైద‌రాబాద్ లో యూనిట్ జోరుగా ప్రచారం నిర్వ‌హిస్తుంది. ఎన్న‌డు లేనిది ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మార్కెట్ పై క‌న్నేసి ఆయ‌న్ టీమ్ ముందుకు రాబోతుంది. అందుకోసం ప్ర‌చారంలో భాగంగా రాజ‌మౌళి..చిరంజీవి లాంటి దిగ్గ‌జాల్ని  సైతం రంగంలోకి ఇప్ప‌టికే దించేసారు.

ఇక ప్ర‌చారంలో భాగంగా బ్ర‌హ్మ‌స్ర్త ప్రాంచైజీ మును ముందు కొన‌సాగుతుంద‌ని ద‌ర్శ‌కుడు రివీల్ చేసారు. ఇప్ప‌టికే రెండ‌వ భాగం ఉంటుంద‌ని దానికి  కోన‌సాగింపుగా థ‌ర్డ్ పార్ట్ ఇలా కొన్ని భాగాలు బ్ర‌హ్మ‌స్ర్త‌ నుంచి రాబోతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే  ప్రాంచైజీ కొనసాగ‌లంటే ముందు పార్ట్-1 పెద్ద స‌క్సెస్ అవ్వాలి. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన  చిత్రం కాబ‌ట్టి ఇండియాన్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించాలి.

అప్పుడే ప్రాంచైజీ కొన‌సాగడానికి అవ‌కాశం ఉంది. అయితే ద‌ర్శ‌కుడు ముందే ఇలా రివీల్ చేయ‌డంపై కాస్త ఓవ‌ర్ కాన్పిడెన్స్ క‌నిపిస్తుంద‌న్న విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. సినిమా రిలీజ్ కాలేదు. స‌క్సెస్  అయింది లేదు. అప్పుడే ఇలా భాగాలంటూ ముందుకు రావ‌డం ప‌బ్లిసిటీ స్టంట్ లా ఉందంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన  ట్రైల‌ర్ కి  స‌రైన రెస్పాన్స్ రాలేదు. విఎఫ్ ఎక్స్ పేల‌వంగా...రొటీన్ గా ఉంది అనే విమ‌ర్శ‌లొస్తున్నాయి. సోషియా ఫాంట‌సీ సినిమాలో విఎఫ్ క్స్ చాలా కీల‌కం.  వాటిని  రిచ్ గా నాణ్య‌త‌తో  చూపించాలి. కానీ బ్ర‌హ్మ‌స్ర్త  ట్రైల‌ర్ లో  రెండు మిస్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో  ర‌ణ‌బీర్ నేల విడిచి సాము చేస్తున్నాడా? అని విమ‌ర్శ‌లు వెల్లు వె త్తుతున్నాయి. ఈ త‌రుణంలో `బ్రహ్మ‌స్ర్త ` ప్రాంచైజీ అంటూ ద‌ర్శ‌కుడు ఊద‌ర‌గొట్ట‌డం ఓవ‌ర్ గానే ఉందంటున్నారు. మ‌రి ఆ సంగ‌తి తేలాలంటే  సెప్టెంబ‌ర్ 9వ తేదీ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన కేజీఎఫ్ రిలీజ్ స‌మ‌యంలో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌- చిత్ర‌ యూనిట్ ఎలాంటి హ‌డావుడి చేయ‌లేదు. సైలెంట్ గా వ‌చ్చారు కొట్టారు... ఆ త‌ర్వాత కూల్ గా రెండ‌వ భాగం రిలీజ్ చేసి దాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ చేసారు. మూడ‌వ భాగం ఉంటుందా? ఉండ‌దా? అని ప్రేక్ష‌కుల్లో ఓ క్యూరియాసిటీ క‌ల‌గ‌చేసారు. ఉంటుంది! అన్న విష‌యం ప్ర‌శాంత్ నీల్ కి తెలిసినా రివీల్ చేయ‌లేదు. అభిమానుల‌చే  ఉండాలి అని కోరుకునే లా చేసారు. అదీ కేజీఎఫ్ గొప్ప‌త‌నం.
Tags:    

Similar News