రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' మోస్ట్ అవైటెడ్ 2022 జాబితాలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల సందర్భంగా కపూర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా భారీ క్రేజ్ తో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతున్నందున రికార్డులు బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. అస్ట్రావర్స్ లో ఇది మొదటి భాగం.. రెండో భాగం కూడా తెరకెక్కుతుందన్న ప్రచారం నడుమ బోలెడంత హైప్ నెలకొంది.
అగ్నితో సంబంధం ఉన్న కథానాయకుడి కథాంశం రక్తి కట్టించే విజువల్ ఫీస్ట్ అవుతుందని భావిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బాలీవుడ్ లో ఉన్న నెగెటివ్ ట్రెండ్ తో సంబంధం లేకుండా అంచనాల్ని పెంచింది. పాన్-ఇండియా ఓపెనింగ్ కోసం టీమ్ జోరుగా ప్రచారం సాగించడం తెలిసిందే. రిలీజ్ ముందు వరకూ దేశంలోని అన్ని ప్రధాన మెట్రోలు ఇతర నగరాలకు సుడిగాలి పర్యటనలు చేసిన చిత్రబృందం ప్రచారం పరంగా ఏ లోటూ లేకుండా ప్రయత్నించింది.
ప్రస్తుతం ట్రేడ్ పండితులంతా ఎవరికి వారు విశ్లేషణల్లో పడ్డారు. ఈ సినిమా ఓపెనింగ్ డే వసూళ్లు ఎలా ఉండనున్నాయి? తొలి వీకెండ్ ఏ రేంజుకు చేరుకుంటుంది? అన్నది ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ ఇతర హిందీ సినిమా ఓపెనింగ్ డే లో రెండంకెల స్కోర్ చేయలేక చతికిలబడ్డాయి. అయితే దీనిని బ్రహ్మాస్త్ర బ్రేక్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఇది భారీ పౌరాణిక డ్రామా.. భారీ బడ్జెట్ సినిమా కావడం.. భారీ తారాగణం నటించడంతో అంచనాలు రెట్టించాయి. అందుకే ఈ చిత్రం హిందీ మార్కెట్ లోనే మొదటి రోజు 25-30 కోట్ల భారీ ఓపెనింగ్ ని రాబట్టవచ్చని.. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయగలిగితే ఆర్.ఆర్.ఆర్ డే-వన్ రికార్డును బ్రేక్ చేసినట్టే. కానీ కేజీఎఫ్ 2 - బాహుబలి 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ల డేవన్ వసూళ్లను అధిగమించడం అంత సులువేమీ కాదని కూడా అంచనా ఉంది.
మూడు గంటలు కూచోబెడితేనే..! బ్రహ్మాస్త్ర చుట్టూ ఉన్న విపరీతమైన హైప్ అంచనాల నేపథ్యంలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. ఈ చిత్రం మంచి ప్రారంభంతో టేకాఫ్ అవుతుందని భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ లు ఈ చిత్రం ప్రారంభ రోజు కలెక్షన్లు బలమైన రెండంకెల రేంజ్ లో ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఈ చిత్రానికి CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) UA సర్టిఫికేట్ తో క్లియర్ చేసింది. సినిమా నిడివి సుదీర్ఘ సమయం ఉంది. సుమారు 166.54 నిమిషాల (2 గంటలు 46 నిమిషాల 54 సెకన్లు) షో ఇది. బ్రహ్మాస్త్రం మూడు గంటల మార్కుకు చాలా దగ్గరగా ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే చాలా ఎక్కువ సేపు ఓపిగ్గా చూడాల్సి ఉన్నా కానీ ప్రేక్షకుల అంచనాల రేంజులో కంటెంట్ ఉంటుందని బలమైన టాక్ వినిపిస్తోంది.
ట్రేడ్ నివేదికల ప్రకారం.. VFX సహా ఈ మూవీ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ నమ్ముతోంది. కొన్ని వరుస పరాజయాలు చవి చూసిన బాలీవుడ్ కి బ్రహ్మాస్త్ర పూర్తి ఊరటనిస్తుందా లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.