హిందీ స్టార్ హీరోయిన్లు కనెక్ట్ అవుతారా?

Update: 2019-11-13 09:22 GMT
టాలీవుడ్ లో హిందీ భామల హవా ఎక్కువన్న సంగతి తెలిసిందే. మన హీరోయిన్ల లిస్టు తీస్తే ఎక్కువ భాగం హిందీ భామలే ఉంటారు. మిగిలిన వారిలో కన్నడ మలయాళ తమిళ కొంకణిలకు చిందిన కింకిణిలు ఉంటారు. అయితే వీరందరినీ మన ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు.  భాటియా.. అగర్వాల్.. కపూర్ .. ఇలాంటి నార్త్ సర్నేమ్స్  ఇప్పుడు తెలుగు పలెల్లో కూడా తెలుసంటే అది మన టాలీవుడ్ పుణ్యమే.  అయితే మొదటి నుంచి ఈ హీరోయిన్లందరూ తెలుగు సినిమాల్లో చేసేవారు కాబట్టి ప్రేక్షకులకు స్లోగా అలవాటు అయ్యారు.

రీసెంట్ గా పెద్ద ప్రాజెక్ట్ ఉందంటే చాలు బాలీవుడ్ లో ఉండే ఎవరైనా ఒక స్టార్ హీరోయిన్ ను సైన్ చేసేందుకు చూస్తున్నారు.  వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాలలో నటింపజేస్తున్నారు.  అయితే ఇంత చేసినా వారు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారా అనేది ఆలోచించాల్సిన విషయం.  ఈమధ్యే రిలీజ్ అయిన 'సాహో' లో శ్రద్ధ కపూర్ నటించడం బాలీవుడ్ మార్కెట్ కు ప్లస్ అయిందేమో కానీ శ్రద్ధ కపోర్ తెలుగు ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు.  సిటీ యూత్ అర్బన్ ఆడియన్స్ శ్రద్ధాను లైక్ చేసినా.. మిగతావారికి పెద్ద నచ్చలేదని కామెంట్లు వినిపించాయి.  

ఇక రాజమౌళి చిత్రం 'RRR' లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ఎంపిక చేసుకున్నారు. అలియా మంచి నటి అనే విషయంలో సందేహం లేదు. అయితే తెలుగు ఆడియన్సు ఎంత మేరకు ఓన్ చేసుకుంటారనేది అనుమానమే.  ఈ విషయంలో రాజమౌళికి కూడా చాలామంది సలహాలు ఇస్తున్నారని కూడా టాక్ ఉంది.  అయితే ప్యాన్ ఇండియా మార్కెట్ కోసం తప్పనిసరిగా బాలీవుడ్ టచ్ ఇవ్వాల్సిందేనని సర్దుకుపోవాలేమో.  మరో విషయం ఏంటంటే ఇలా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చిన హీరోయిన్లు గతంలో ఎక్కువమంది ఫెయిల్ అయ్యారు.  మరి ఫ్యూచర్లో ఇలా నటిస్తున్న హిందీ స్టార్ హీరోయిన్లు ఎంతమేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.
Tags:    

Similar News