మృణాల్ ఠాగూర్.. మహారాష్ట్రలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ 2014లో విడుదలైన ఓ మరాఠీ చిత్రం తో కెరీర్ ను ప్రారంభించింది. 2018 లో 'లవ్ సోనియా'తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తనదైన టాలెంట్ తో అక్కడ వరుస అవకాశాలను దక్కించుకుంది. ఈ మధ్యే 'జెర్సీ' మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' సినిమాకు ఇది రీమేక్.
ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. క్రికెట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఇకపోతే మృణాల్ ఠాగూర్ తాజాగా 'సీతారామం' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 'మహానటి' తర్వాత దుల్కర్ నేరుగా తెలుగులో చేసిన చిత్రమిది.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై హై బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో విడుదలై.. తొలి షో నుండే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
యుద్దంతో ముడిపడి ఉన్న ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా కథంతా 1965, 1985 నేపథ్యంలో సాగుతుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీలకు స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి 'సీతారామం'లో కూడా తమ మ్యాజిక్ ను చూపించాడు. ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. అలాగే సీత పాత్రకు మృణాల్ పూర్తి న్యాయం చేసింది.
తెరపై బ్యూటిఫుల్‌గా కనిపించడమే కాదు.. ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే మరింత అద్భుతంగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. 'సీతా రామం' సినిమాతో మృణాల్ కు గ్రాండ్ ఎంట్రీ లభించిందని, ఇక ముందు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఆమె మారిపోవడం ఖాయమంటూ సినీ ప్రియులు భావిస్తున్నారు. మరి మృణాల్ తెలుగులో ఏ మాత్రం ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.