శృతిహాస‌న్ ఈ క్రేజ్ ని నిల‌బెట్టుకుంటుందా?

Update: 2022-12-24 06:16 GMT
సినీ ఇండ‌స్ట్రీలో క్రేజ్ ఎవ‌రికి ఎప్పుడు మొద‌ల‌వుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అది మొద‌లైన‌ప్పుడు దాన్ని నిల‌బెట్టుకోవ‌డం కూడా పెద్ద టాస్కే. అలా నిల‌బెట్టుకున్న వాళ్లే ఇక్క‌డ ఎక్క‌వ కాలం కొన‌సాగుతూ వుంటారు. అయితే కొంత మందికి అనుకున్న క్రేజ్ ముందే వ‌చ్చేస్తూ వుంటుంది. మ‌రి కొంత మంది ఆ టైమ్ కోసం ఎదురు చూస్తూ వుంటారు. మ‌రి కొంత మంది మాత్రం వ‌చ్చిన క్రేజ్ ని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోగా ప‌క్కదారి ప‌డుతుంటారు.

శృతిహాస‌న్ కూడా ఇదే చేసింది. తెలుగులో 'అన‌గ‌న‌గా ఒక ధీరుడు' మూవీతో తెరంగేట్రం చేసిన శృతిమాస‌న్ ఆ త‌రువాత హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటూ హీరోయిన్ గా త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో దూసుకుపోయింది. తెలుగులో 'గ‌బ్బ‌ర్ సింగ్‌', బ‌లుపు వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని ద‌క్కించుకుని టాలీవుడ్ లో స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకుంది. కాల‌మ రాయుడు వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ వ‌చ్చింది.

తెలుగులో స్టార్ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకోబోతున్న క్ష‌ణాల్లోనే 2017లో సైడైపోయి అంద‌రిని షాక్ కు గురిచేసింది. లండ‌న్ బేస్డ్ బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి చెట్ట‌ప‌ట్టాలేసుకు తిరుగుతూ కెరీర్ ని ప‌క్క‌న ప‌డేసింది. దీంతో శృతి ఒక్కసారిగా మ‌ళ్లీ జీరోకి వెళ్లిపోయింది. త‌న‌తో కెరీర్ ప్రాంబించిన వాళ్లంతా స్టార్ హీరోయిన్ లుగా స్టార్ డ‌మ్ ని ఎంజాయ్ చేస్తుంటే శృతిహాస‌న్ మాత్రం మ‌ళ్లీ అవ‌కాశాల కోసం వెతుక్కోవ‌డం మొద‌లు పెట్టింది.

మ‌ళ్లీ 'క్రాక్‌' మూవీతో తెలుగులో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని సెకండ్ ఇన్నింగ్స్ ని మొద‌లు పెట్టింది. ఆరంభంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌భించ‌డంతో ఇక వెను తిరిగి చూసుకోవ‌డం లేదు. వెంట‌నే 'వ‌కీల్ సాబ్'తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న శృతిహాస‌న్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ ఫేవ‌రేట్ గా నిలుస్తోంది. ప్ర‌స్తుతం త‌న చేతిలో మూడు క్రేజీ సినిమాలున్నాయి. సీనియ‌ర్ హీరోలు చిరంజీవి తో 'వాల్తేరు వీర‌య్య‌', బాల‌కృష్ణ‌తో 'వీర సింహారెడ్డి' సినిమాల్లో న‌టిస్తోంది. ఇవి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.

వీటితో పాటు ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స‌లార్‌'లోనూ న‌టిస్తోంది. ఈ మూవీతో వృథి కెరీర్  టాప్ లోకి వెళ్ల‌డం కాయం అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న టూ కాస్ట్లీ అయిపోవ‌డంతో అంతా ఇప్పుడు శృతి వెంట ప‌డుతున్నార‌ట‌. అంతే కాకుండా అంద‌రికి ప్ర‌స్తుతం వృతి బెస్ట్ ఆప్ష‌న్ గా మారింద‌ని తెలుస్తోంది,. అయితే ఈ క్రేజ్ ని శృతి ఇలాగే కంటిన్యూ చేస్తూ కాపాడుకుంటుందా? మ‌ళ్లీ గ‌తంలో సైడ్ అయిన‌ట్టుగా సైడయిపోయి షాకిస్తుందా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News