‘బాహుబ‌లి’ నిర్మాతలైనా బ్రేక్ ఇస్తారా?

Update: 2021-04-13 13:30 GMT
‘బాహుబ‌లి’ నిర్మాతలైనా బ్రేక్ ఇస్తారా?
  • whatsapp icon
అన్ని ఉన్నా..మన టైమ్ బాగోలేకపోతే ముందుకు వెళ్లటం కష్టం..ఇది పరిశ్రమలో టెక్నిషియన్స్, నటీనటులు,నిర్మాతలు అందరూ చెప్పే సినీ సత్యం. చాలా సార్లు ఇది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా కొందరు కెరీర్ ముందుకు కదలనప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. టాలెంట్, అందం ఉన్న రెజీనా కాసాండ్రా.. పరిస్దితి అదే.  'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె అప్పటినుంచి పడుతూ లేస్తూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.  'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టినా, మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం హిట్ అయ్యేదాకా ఆమెను పట్టించుకున్న వాళ్లే లేరు. ఆ తర్వాత, 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'అ' వంటి లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

 కేవలం గ్లామర్ షో కే పరిమితం కాకుండా మంచి ఆర్టిస్ట్ గానూ ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతుంది. ఈ మధ్యనే వచ్చిన విశాల్ 'చక్ర' లోనూ విలన్ గా కనిపించింది. ఆమె బాగా చేసింది అన్నా...సినిమా ఆడకపోవటంతో పట్టించుకున్నవాళ్లు లేరు. మంచి బ్రేక్ కోసం చూస్తున్న ఆమెకు ఇప్పుడు వెబ్ సీరిస్ రూపంలో మరో మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడి సత్తా ఏమిటో చూపిన భారీ విజువ‌ల్ వండ‌ర్ ‘బాహుబ‌లి’ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఇప్పుడు ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేసారని స‌మాచారం. హార‌ర్ జోన‌ర్‌లో వెబ్ సిరీస్‌ను నిర్మించ‌బోతున్నార‌ని, అందులో హీరోయిన్ రెజీనా క‌సాండ్ర మెయిన్ క్యారక్టర్ లో న‌టించ‌బోతుంద‌ని టాక్ వినిపిస్తోంది.

మామూలుగా వెబ్ సీరిస్ అంటే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ బాహుబలి నిర్మాతలు అనగానే జనం కాస్త ఎలర్ట్ అయ్యారు. రెజీనా కు ఈ సీరిస్ తో అయినా క్రేజ్ వచ్చి మంచి ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నారు. ఎందుకంటే బాహుబలి నిర్మాతల టేస్ట్ పై జనాలకంత నమ్మకం. ఏదో ఒక విశేషం లేనిదే ప్రాజెక్ట్ టేకప్ చేయరని,అలాగే కథ డిమాండ్ చేస్తే ఎంత బడ్జెట్ పెట్టడానికి అయినా వెనకాడరని ఈ నిర్మాతలకు పేరు ఉంది. దాంతో రెజీనా ఈ బ్యానర్ లో ఆఫర్ రావటం ..ఆమెకు టైమ్ స్టార్ట్ అయ్యినట్లే అంటున్నారు.  త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌కట‌న వెలువ‌డుతుంద‌ని అంటున్నారు. 
Tags:    

Similar News