యంగ్ డైరెక్ట‌ర్ రేర్ ఛాలెంజ్ ని స్వీక‌రిస్తాడా?

Update: 2022-04-07 08:30 GMT
క‌శ్మీర్ నేప‌థ్యంలో అత్యంత భారీ విజువ‌లైజేష‌న్ తో ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని పూర్తి చేయాలంటే స‌వాళ్ల‌తో కూడుకున్న‌ది. ఇదేమీ అంత సులువు కాదు. కానీ అలాంటి ఛాలెంజ్ ని స్వీక‌రిస్తున్నాడ‌ట‌ శివ నిర్వాణ‌. అత‌డు ప్ర‌స్తుతం ఓ ప్రేమ‌క‌థా చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌-స‌మంత జంట‌గా న‌టించ‌నున్నారు.

అయితే ఆ ఇద్ద‌రి కాల్షీట్ల స‌ర్ధుబాటు స‌మ‌స్యాత్మ‌కంగా మారింద‌ని తెలుస్తోంది. ఓవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ త‌రవాత వెంట‌నే పూరీతోనే మ‌రో సినిమా చేయ‌నున్నాడు.

అయితే ఆ సినిమా చేసేందుకు త‌న‌కు నాలుగు నెల‌ల స‌మ‌యం ఇంకా మిగిలి ఉంది. ఈలోగానే ఈ స‌మ‌యాన్ని శివ నిర్వాణ‌కు దేవ‌ర‌కొండ కేటాయిస్తున్నాడు. మ‌రోవైపు స‌మంత కాల్షీట్ల‌ను బ‌ట్టి కూడా త‌న‌కు టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. సామ్ అటు బాలీవుడ్ లోనూ న‌టిస్తున్నందున త‌న కాల్షీట్ల‌ను స‌ర్దుబాటు చేయ‌డం కాంప్లికేటెడ్ గా ఉందిట‌.

ఇలాంటి భారీ చిత్రానికి నాలుగు నెల‌ల డెడ్ లైన్ అంటే అంత సులువేమీ కాదు. క‌శ్మీర్ నేప‌థ్యంలో సుమారు ఏడెనిమిది నెల‌ల స‌మ‌యం ఉంటే కానీ ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని గ్రాండ్ గా తెర‌కెక్కించ‌డం కుద‌ర‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

దేవ‌ర‌కొండ మారిన ఇమేజ్ కార‌ణంగా పాన్ ఇండియా అప్పీల్ తో సినిమా తీయాలి కాబ‌ట్టి ఇది భారీ ప్రాజెక్ట్ అవుతుంది. కానీ శివ నిర్వాణ ఈ ఛాలెంజ్ ని ఎలా టేక‌ప్ చేస్తారో చూడాలి.  

నానీ తో ట‌క్ జ‌గ‌దీష్ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన శివ నిర్వాణ‌కు ఇప్పుడు ఇదే స‌ద‌వ‌కాశం. దీనిని స‌ద్వినియోగం చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాడు. మ‌జిలీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌-స‌మంత జంట‌తో అదిరిపోయే ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాల‌నుకున్న శివ నిర్వాణ‌కు అది కుద‌ర‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దేవ‌ర‌కొండ‌-స‌మంత‌తో ఏమేర‌కు క‌థ‌ను విజ‌య‌వంతంగా న‌డిపిస్తాడో చూడాలి.
Tags:    

Similar News