పేరుకే సినిమా షూటింగ్ ..లోపల అంతా అదే

Update: 2019-11-08 06:48 GMT
ప్రస్తుత రోజుల్లో యువత సగం చెడిపోవడానికి కారణం సినిమాలే. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం ఇదే జరుగుతుంది. సినిమాలలో నటిస్తే వారిలాగే లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా సినిమాలలోకి రావాలనే కోరికతో ఎంతో మంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. సినిమాలలో నటించాలనే కోరిక ఉండేవారినే టార్గెట్ చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.

ముందుగా వారికి షార్ట్ ఫిలిమ్స్ , సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామని అని నమ్మించి ..ఆ తరువాత డబ్బు ఆశ చూపి లైంగికంగా వారిని అనుభవించి , మోసం చేసే వారిని ఎంతోమందిని చూస్తున్నాం కానీ , ఆలా మోస పోయే వారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు తప్పా తగ్గడంలేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెల్లూరు లో జరిగింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ..వారిని శారీరకంగా అనుభవించి ..దాన్ని సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసి ..ఆ వీడియో ని అడ్డుపెట్టుకొని అమాయమకమైన మైనర్ బాలికలతో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టుని నగర పోలీసులు బయటపెట్టారు.

నెల్లూరు నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన షేక్‌ జాకీర్‌హుస్సేన్‌ అలియాస్‌ మహేష్‌ నెల్లూరు స్టార్‌గన్‌ పేరుతో షార్ట్‌ ఫిల్మ్స్‌లు తీస్తున్నానంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. పరిచయమైన వ్యక్తులు, స్నేహితుల ద్వారా మైనర్‌ బాలికలను, యువతలను ఆకర్షించేవాడు. అనంతరం వారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి శారీరకంగా అనుభవించేవాడు. వాటిని రహస్య కెమెరాల్లో చిత్రీకరించాడు. యువతులు, బాలికలకు చూపించి బ్లాక్‌ మెయిల్  చేసి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించేవాడు. వచ్చిన ఆదాయాన్ని ఇరువురూ పంచుకునేవారు. నాలుగేళ్లుగా చీకటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అదేక్రమంలో కొందరిని చేరదీసి వ్యభిచార గృహాలు నిర్వహించసాగాడు. 

ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. మైనర్‌ బాలిక ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు జాకీర్‌హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా కోటమిట్టరోడ్డులో, స్టోన్‌హౌస్‌పేట, పోస్టల్‌కాలనీ, జ్యోతినగర్‌లో, చి్రల్డన్స్‌పార్కు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు గురువారం ఏకకాలంలో ఆయా గృహాలపై దాడులు చేశారు. నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకుని వారి చెరలో ఉన్న యువతులకు విముక్తి కల్పించారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ల్యాప్‌టాప్, మోటార్‌బైక్, 14 సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. కోవూరుకు చెందిన ఓ బాలిక షార్ట్‌ ఫిల్మ్స్, సినిమాల పేరిట ఆకర్షించి చీకటి కార్యకలాపాల్లోకి దించుతున్నారని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో కూపీలాగడంతో డొంకంతా కదిలింది.
Tags:    

Similar News