ఆ హీరోయిన్ కొత్త సైన్ చేయట్లేదే?

Update: 2017-07-14 05:17 GMT
ఆమె ఓ యంగ్ హీరోయిన్. టాలీవుడ్ లో లక్కీ మస్కట్ అనే ట్యాగ్ కూడా ఉంది. అంతే కాదు.. హిట్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేయడంతో వరుసపెట్టి ఛాన్సులు వచ్చేశాయి. అయితే.. ఇప్పుడీ భామ చేతిలో ఒక్క సినిమా తప్ప.. వేరే ప్రాజెక్ట్ ఏదీ లేదు. ఇందుకు కారణం.. ఆమె సినిమాలను ఒప్పుకోకపోవడమే అని తెలుస్తోంది.

ఇప్పుడీ భామ పీకల్లోతు ప్రేమ వ్యవహారంలో మునిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఒకే హీరోతో వరుసగా నాలుగు సినిమాలు చేసిన ఈ యంగ్ బ్యూటీ.. అతనితో ఎఫైర్ లో ఉందంటూ రకరకాల గాసిప్స్ వినిపించాయి. అయితే.. వాటిపై ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు సరికదా.. మరింతగా రెచ్చగొట్టేట్లుగా ప్రవర్తించారు ఇద్దరూ. ఈ హీరోయిన్ నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. అందుకే కొత్త ఆఫర్స్ రావడం లేదని అంతా అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ఒకే ఒక సినిమాలో నటిస్తోందని చెప్పుకున్నాం కదా. బడా నిర్మాత కొడుకుగా కొంతకాలం క్రితం అరంగేట్రం ఆ హీరోతోనే ఈమె ప్రేమ వ్యవహారం సాగిస్తోందట.

అంతే కాదు.. వీరిద్దరూ తమ ప్రేమను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మేనేజర్ ను మార్చిన ఈ హీరోయిన్.. అందుకే కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని అంటున్నారు.


Tags:    

Similar News