లైంగిక వేధింపుల‌పై యంగ్ హీరోయిన్స్ షాకింగ్ పోస్ట్‌!

Update: 2022-09-29 13:30 GMT
లైంగిక వేధింపుల‌కు సంబంధించిన మ‌ల‌యాళ స్టార్ కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. హీరో దిలీప్‌, అత‌ని భార్య కావ్య మాధ‌వ‌న్ మ‌రో హీరోయిన్ పై ప్లాన్ చేసి మ‌రీ కొంత మంది చేత లైంగిక వేధులకు గుర‌కిచేయించారు. ఈ సంఘ‌ట‌న యావ‌త్ దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లాన్ని సృష్టించి హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో మ‌రో ఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఇద్ద‌రు యంగ్ హీరోయిన్స్ ఇటీవ‌ల లైంటిక వూధింపుల‌కు గుర‌య్యార‌ట‌. ఓ సినిమాలో వీరిద్ద‌రు క‌లిసి న‌టించారు. రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా  కాలిక‌ట్ లోని హిల్దే మాల్ కు వెళ్లార‌ట‌.

ప్ర‌చారం అనంత‌రం మాల్  నుంచి బ‌య‌టికి వ‌స్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రిపై లైంగిక దాడి జ‌రిగిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఈ ఇద్ద‌రు హీరోయిన్ లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి షాకిచ్చారు.  

జీవితంలో ఎవ‌రికీ కూడా త‌మ లాంటి చేదు అనుభ‌వం జ‌ర‌గ‌కూడ‌ద‌ని పేర్కొంది. 'మా కొత్త సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం కాలిక‌ట్ లోని మాల్ కు చిత్ర బృందం తో క‌లిసి నేనూ వెళ్లాను. అంతే కాకుండా కాలిక‌ట్ లోని అనేక ప్రాంతాల్లో ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించాం.

మేము వెళ్లిన ప్ర‌తీ చోట ప్ర‌జ‌లు చూపించిన ప్రేమాభిమానాల‌కు థాంక్స్‌. కానీ మాల్ లో నిర్వ‌హించిన ఈవెంట్ కు భారీ ఎత్తున అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. భారీ క్రౌడ్ ని అదుపుచేయ‌లేక సెక్యూరిటీ ఇబ్బందిప‌డ్డారు. అదే స‌మ‌యంలో నేను, నా స‌హాయ న‌టి బ‌య‌టికి వ‌స్తున్నాం.

ఆ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. మాల్ లో ప్ర‌జ‌లు భారీ స్థాయిలో వుండ‌టంతో త‌న‌కు స్పందించే వీలు చిక్క‌లేదు. త‌న ముఖాన్ని కూడా చూడ‌లేదు. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే నాకు కూడా ఎదురైంది. దీంతో నేను షాక్ కు గుర‌య్యాను. నా లాంటి అనుభ‌వం జీవితంలో మ‌రెవ‌రికీ ఎదురు కాకూడ‌దు. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకోవాలి' అని ఓ యంగ్ హీరోయిన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టి షాకిచ్చింది. మ‌రో న‌టి కూడా ఇదే త‌ర‌హాలో ఓ పోస్ట్ ని షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం మాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ ల‌పై లైంగిక దాడి అంశం హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull View
Tags:    

Similar News