టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా అభిమానులకు తీపికబురు చెప్పాడు. ట్విట్టర్ వేదికగా తాను కరోనా నుండి బయటపడినట్లు తెలిపాడు. గత రెండు వారాలుగా ఎన్టీఆర్ కోవిడ్ తో హోమ్ క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు టెస్ట్ చేయగా నెగటివ్ వచ్చినట్లు తెలిపాడు. తనకు నెగటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్ తో అభిమానులలో ఆనందం డబుల్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం ఆ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నెల 10న ఎన్టీఆర్ తనకు కరోనా టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికనే తెలియజేశాడు. అప్పటినుండి ఎన్టీఆర్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే తమ అభిమాన హీరోకు కోవిడ్ పాజిటివ్ అనేసరికి ఫ్యాన్స్ అంతా కంగారుకు లోనయ్యారు.ఆ వెంటనే ఎన్టీఆర్ త్వరగా కరోనా బారినుండి కోలుకోవాలని ప్రార్ధనలు చేయడంతో పాటు విషెస్ తెలుపుతూనే ఉన్నారు. అలాగే సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. అయితే తాజాగా తనకు కరోనా నెగిటివ్ గా తేలినట్లు ఎన్టీఆర్ చెప్పడంతో పాటు సంతోషం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు వైద్యం అందించిన వైద్యులకు కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం విశేషంగా చెప్పవచ్చు.
అయితే కరోనా బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. కరోనా ప్రాణాంతక వ్యాధి కాదని, మంచి వైద్యం - ఆహారం - జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటిస్తే బయటపడవచ్చని ఎన్టీఆర్ సూచించాడు. ముఖ్యంగా ఆత్మస్థైర్యమే కరోనాతో పోరాడే ఆయుధం అని.. అలాగే భయపడకుండా ఉంటే కరోనాను ఈజీగా తరిమి కొట్టవచ్చని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. మొత్తానికి ఎన్టీఆర్ ఆరోగ్యం వార్త గురించి తెలియగానే ఫ్యాన్స్ అంతా కాసేపు పట్టలేని ఆనందం పొందినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అలాగే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాజు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం.