టాలీవుడ్ హీరోల్లో రోల్స్ రాయల్స్ ట్రెండ్ అప్పట్లో ఉండేది. ఆ తరువాత అది కాస్త రేంజ్ రోవర్ కి మారింది. ప్రస్తుతం మహేశ్- బన్నీ- రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు రేంజ్ రోవర్ వాడుతున్నారు. అది కాస్తా ఇప్పుడు లాంబోర్ఘిణికి మారింది. గత నెలలో ప్రభాస్ లాంబోర్ఘిణి కార్ ని సొంతం చేసుకున్నారు. దానిపై తన సోదరీమణులు రైడ్ కి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ కూడా ఈ క్లబ్ లో చేరారు. ఇండియాలోనే మొట్టమొదటి లాంబోర్ఘిణి గ్రాఫైట్ ఎడిషన్ కారుని యన్టీఆర్ సొంతం చేసుకోవడం విశేషం.
భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కార్ జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజ్ లో చేరింది. నిజానికి ఎన్టీఆర్ గ్యారేజీలో ఇప్పటికే బోలెడన్ని హై ఎండ్ కార్లు ఉన్నా.. లంబోర్ఘిణి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ గా మారింది. ఖరీదైన కార్లపై తారక్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా లంబోర్ఘిణిని సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు ప్రభాస్ మాత్రమే లంబోర్ఘిణిని సొంతం చేసుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా పాపులరయ్యారు. ఇప్పుడు తారక్ జాబితాలో రెండో హీరోగా చేరారు. ఇక రామ్ చరణ్ కి ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కార్ ఉంది.
ఇంతకీ ఈ లంబోర్ఘిణి ఉరుస్ కార్ ప్రత్యేకత ఏమిటి? అంటే.. ఇది అరోన్సియో అర్గోస్ తో కాంట్రాస్ట్ కలర్ తో నీరో నోక్టిస్ మాట్ బ్లాక్ కలర్ తో డిజైన్ చేసినది. ఇది యూనిక్ కలర్ కాంబినేషన్ తో రోడ్లపై హెడ్ టర్నర్ గా నిలుస్తుంది. హై స్పీడ్ హై ఎండ్ టెక్నాలజీతో డిజైన్ చేయబడినది. తారక్ కార్ కి సంబంధించిన ఫోటోలను బెంగళూరుకు చెందిన ఆటో మొబిలియార్డెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కబురు తారక్ అభిమానులకు చేరడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
నిజానికి ఇంతకుముందే లంబోర్ఘిణి తారక్ ఇంటికి చేరుకుందని ఆ కార్ లో చరణ్ ఇంటికి వెళ్లాడని కూడా ప్రచారమైంది. కానీ దానిని తారక్ సన్నిహితులు ఖండించారు. లంబోర్ఘిణి కోసం తారక్ ఏడాది కాలంగా అడ్వాన్స్ ఇచ్చి వేచి చూస్తున్నారని త్వరలోనే సొంతమవుతుందని వెల్లడించారు. ఎట్టకేలకు తన డ్రీమ్ కార్ ని తారక్ సొంతం చేసుకున్నారు. అతడి కార్ గ్యారేజీలో రాజులా లంబోర్ఘిణి ఠీవిని ప్రదర్శించబోతోంది. ప్రస్తుతానికి లంబోర్ఘిణి ట్రెండ్ కొనసాగుతోంది. ఆ తర్వాత మరో కొత్త బ్రాండ్ పైనా మన స్టార్లు కన్నేస్తారేమో చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో RRR షూటింగ్ లో ఉన్నారు. ఈ చిత్రం దసరా లేదా క్రిస్మస్ బరిలో రిలీజయ్యేందుకు ఆస్కారం ఉందని కథనాలొస్తున్నాయి.