వచ్చే నెల 8న విడుదల కాబోతున్న యాత్ర మీద భారీ కాదు కాని ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. ఎన్నో జనరంజక పధకాలతో పాలనతో జనం గుండెల్లో నిలిచిపోయిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలో పాదయాత్ర ఘట్టాన్ని నేపధ్యంగా తీసుకుని దర్శకుడు మహి రాఘవ తీసిన ఈ మూవీ ఆడియో ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్ మొదటి భాగం నిరాశపరిచిన తరుణంలో యాత్ర ఎంతమేరకు మెప్పిస్తుంది అనే దాని మీద అనుమానాలు లేకపోలేదు. అయితే మహి రాఘవ ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు.
ఇందులో అవాస్తవాలు ఏమి చూపలేదని జగన్ సైతం నాన్న చేయనివి జోడించే ప్రయత్నం చేయొద్దని ముందే చెప్పినట్టు తెలిపాడు. అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాత్రను ఎన్టీఆర్ కు పోటీగా తీసుకురావాలనే మహి ఆలోచనట. అందుకే సంక్రాంతికే తొలుత ప్లాన్ చేసుకుంటే విపరీతమైన పోటీతో పాటు ఎన్టీఆర్ రెండు భాగాలని తెలిసి ఫిబ్రవరికి మార్చుకున్నట్టు చెప్పారు.
అయితే ఎన్టీఆర్ మహానాయకుడుని యాత్ర టార్గెట్ చేసిన మాట నిజం. ఆ సినిమా ప్రకటించిన డేట్ కు ఒక్క రోజు ముందు యాత్ర వచ్చేలా ప్లాన్ చేసి ప్రకటన ఇచ్చారు. అయితే ఇప్పుడు మహానాయకుడు విడుదల సందిగ్ధంలో పడింది. ఓ వారం ఆలస్యం కావొచ్చు. సో ఎన్టీఆర్ తో డీ కొందామని ఎంత ప్రయత్నించినా అది నేరవేరనట్టే. యాత్ర పెద్దగా పోటీ లేకుండా సాఫీగా రంగంలోకి దిగుతోంది. వైఎస్ ఆర్ గా మమ్ముట్టిగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావడంతో రాజకీయం జనాలతో పాటు సామాన్య ప్రజలు కూడా యాత్ర పట్ల ఆసక్తిగానే ఉన్నారు. అసలే బయోపిక్స్ కి జనవరి అచ్చి రాలేదు. యాత్రతో ఫిబ్రవరిలో అయినా దీన్ని బ్రేక్ చేస్తారేమో చూడాలి