మొన్ననేమో ఎన్టీఆర్ ఆశిస్సులతో సినిమా రిలీజ్ అవ్వాలి అన్నాడు.. తరువాతేమో పవనిజం సాంగ్ అన్నాడు.. ఇప్పుడు దాని రిలీజ్‌కు ఆర్.నారాయణమూర్తి అంటున్నాడు.. ఇక మెయిన్ హీరోయిన్ సయామీ ఖేర్ మొన్న ఇంటర్యూలు ఇచ్చి సందడి చేస్తే.. ఎల్లుండ నుండి శ్రద్దా దాస్ కూడా రంగంలోకి దిగుతుందట.. ఇంతకీ ''రేయ్'' సినిమా గురించి అసలు వైవిఎస్ చౌదరి ఏం చెప్పదలుచుకున్నాడు?
మార్చి 27న రిలీజ్ అవుతోంది ''రేయ్''. చెప్పినా చెప్పకపోయినా మెగా ఫ్యాన్స్ ఎలాగో సినిమాను చూసేస్తారు. ఇకపోతే మిగిలిన ఆడియన్స్‌ను ధియేటర్స్‌కు రప్పించడానికి మనోడు తాపత్రాయం పడుతున్నాడు. ఒకవేళ సినిమా బాగుందనే టాక్ వస్తే ఆటోమ్యాటిక్‌గా జనాలు వచ్చేస్తారు. కాని టాక్ తేడాపడితే మాత్రం సీన్ సితారే. ఈ మధ్య కాలంలో వైవిఎస్ తీసిన సినిమాలన్నీ తొలిరోజు డిజాష్టర్ టాక్ తెచ్చుకున్న సబ్జెక్టులే. సో, జనాలు కూడా కేర్‌ఫుల్‌గానే ఉంటున్నారు.
అందుకే అందరినీ ఎట్రాక్ట్ చేయడానికి ఇలా ప్లాన్లు వేస్తున్నాడు. అయితే వాళ్ళ పేరూ వీళ్ళ పేరూ చెప్పి సినిమాలను అమ్మితే ఆడియన్స్ మాత్రం ఎట్ట నమ్మేస్తారు? ఏమప్పా చౌదరీ.. ఈ ప్లాన్సు ఎట్టా వర్కవుట్ అవుతాయి? ఏదేమైనా ''రేయ్'' మాత్రం ఇప్పుడు పబ్లిక్ టాక్ అయిపోయింది.