సూసైడ్ చేసుకోవాలనుకున్నా..కానీ నా కూతురే ఆపింది!
2008 లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీల్ ని వివాహం చేసుకుంది. ఇతడు నటి అర్చన సోదరుడు.
బాలీవుడ్ నటి ఆర్య అలియాస్ ఆర్య బడాయి సుపరిచితమే. అమ్మడు నటిగా, యాంకర్ గా, హోస్ట్ గా మల్టీట్యాలెంటెడ్ బ్యూటీగా ఫేమస్. రియాల్టీ షోలతోనూ బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా ఆర్యకి నవ్వించే నటి అనే ట్యాగ్ ని కెరీర్ ఆరంభంలోనే వేసుకుంది. అలాంటి నటి వ్యక్తిగత జీవితంలో ఆత్మహత్య వరకూ వెళ్లింది? అన్న సంగతి ఎంత మందికి తెలుసు. వివాహం తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పుల గురించి తాజాగా రివీల్ చేసింది.
2008 లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీల్ ని వివాహం చేసుకుంది. ఇతడు నటి అర్చన సోదరుడు. ఈ దంపతులకు రోయ అనే కుమార్తె ఉంది. అయితే 2019 లో మనస్పర్దలు కారణంగా విడిపోయారు. తాజాగా ఆ నాటి చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆర్య కన్నీటి పర్యంతమైంది. ` బిగ్ బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయట పడలేకపోయాను.
చనిపోదామని ప్రయత్నించాను. నిద్ర మాత్రలు వేసుకుందామని బాటిల్ ఓపెన్ చేసి చేతిలో కి తీసుకున్నాను. ఇంతలో నా కూతురు గుర్తొచ్చింది. నా పాపే ఆ బాధ నుంచి బయటకు తెచ్చింది. తట్టుకోలేనంత బాధ వస్తే బయట పడటం అంత సులభం కాదు. కానీ బంధాలు దాన్ని బయట పడేయగలవు అనిపించింది. మైండ్లో మరో థాట్ కూడా ఉంది. ఉన్న కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలి అనే పాజిటిల్ ఆలోచనవైపు దృష్టి మళ్లించాను.
నా కూతురు గురించి మరో విషయం కూడా ఆలోచించా. నేను చనిపోయాక నా కూతుర్నిసమాజం మరో కోణంలో కూడా చూస్తుంది. ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణాని పాల్పడిందని అంటారు. అది నా కూతురి మైండ్ లో నెగిటివ్ గా ఉంటుంది. తల్లిగా ఆమె దృష్టిలో చెడ్డదాన్ని అవుతాను. అన్నింటికంటే సమాజం తీరు మనిషిపై చాలా బలంగా పనిచేస్తుంది. అందులో మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుంది` అని తెలిపింది.