నా సామి రంగ! వాట్వే వర్కౌట్స్ ఆషిక!

ఆషికా రంగనాథ్.. క్యూట్ లుక్స్ కు ఓ ఇమేజ్ అంటారు టాలీవుడ్ సినీ ప్రియులు. గతేడాది నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది

Update: 2024-02-21 08:46 GMT

ఆషికా రంగనాథ్.. క్యూట్ లుక్స్ కు ఓ ఇమేజ్ అంటారు టాలీవుడ్ సినీ ప్రియులు. గతేడాది నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా కొట్టినప్పటికీ.. ఆషిక గ్లామర్ కు మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో సెకండ్ మూవీకే నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.

సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా చిత్రంలో మిడిల్ ఏజ్డ్ రోల్ లో నటించింది ఆషికా రంగనాథ్. వరాలు పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడికి క్రేజ్ పెరిగింది. కానీ ఆషిక మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. పదుల సంఖ్యలో అవకాశాలు వస్తున్నా.. వాటిలో నుంచి సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది.

అయితే సోషల్ మీడియాలో ఆషిక ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంటోంది. శారీల్లో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తూ దేవ కన్యలా ఫిదా చేస్తోంది. నెటిజన్లను ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుంటోంది. తాజాగా బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ తన వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేసింది. నిజమైన వర్కౌట్స్ సెషన్ అంటే ఏంటో తన ట్రైనర్ గుర్తు తెస్తారని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆషిక వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ మారింది. టైట్ జిమ్ వేర్ వేసుకున్న ఆషిక.. ప్రతీ ఒక్క ఎక్విప్ మెంట్ తో ఓ రేంజ్ లో వర్కౌట్స్ చేసింది. ఎలాంటి పరికరం అయినా తగ్గేదేలే అంటూ జిమ్ చేసింది. మధ్యలో క్యూట్ నవ్వుతూ రిలాక్స్ అయింది. వార్మప్ తో పాటు యోగాసనాలు కూడా వేసింది. ఆషిక వర్కౌట్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వాట్వే వర్కౌట్స్ ఆషిక అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కసరత్తులు అంత తీవ్రంగా ఏ సినిమా కోసం చేస్తుందో అంటూ చర్చించుకుంటున్నారు.

మరోవైపు, ఆషికకు చిరంజీవి విశ్వంభర మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కు ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉంటారట. ఆ పాత్రలన్నింటికీ మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉంటోందట. అందులో ఒక పాత్ర కోసం ఆషికను మేకర్స్ సంప్రదించారట. పాత్రకు మంచి వెయిటేజ్ ఉందని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఇందులో నిజమెంతో చూడాలి.

Tags:    

Similar News