బీచ్‌లో తెలుగ‌మ్మాయ్ బ్యాక్‌లెస్ ట్రీట్!

అషు రెడ్డి తాజా ఫోటోషూట్ మ‌రోసారి అంత‌ర్జాలంలో హాట్ డిబేట్ కి తెర తీసింది. ఇదిగో ఇక్క‌డ ఇలా బికినీ బీచ్ లో అషు బ్యాక్ లెస్ ఫోజ్ తో అద‌ర‌గొట్టింది.

Update: 2023-10-06 16:53 GMT
బీచ్‌లో తెలుగ‌మ్మాయ్ బ్యాక్‌లెస్ ట్రీట్!
  • whatsapp icon

బీచ్ లో బికినీల‌తో వేడెక్కించ‌డం కామ‌న్. కానీ ఇక్క‌డ అందుకు భిన్నమైన లుక్ తో ట్రీటిస్తోంది తెలుగ‌మ్మాయి అషురెడ్డి. ఇంత‌కుముందు ఆర్జీవీ సావాసంలో ఘాటైన ఇంట‌ర్వ్యూతో వేడెక్కించిన అషురెడ్డి, అటుపై ఒంట‌రిగా విదేశీ విహార‌యాత్ర‌ల‌తో ట్రెండీ టాపిక్ గా మారింది. వేడెక్కించే ఫోటోషూట్ల‌తో అషు వెబ్ ని షేక్ చేసింది. అయితే అందుకు త‌గ్గ‌ట్టే సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్లు ద‌క్క‌డం లేదు.


అషు రెడ్డి తాజా ఫోటోషూట్ మ‌రోసారి అంత‌ర్జాలంలో హాట్ డిబేట్ కి తెర తీసింది. ఇదిగో ఇక్క‌డ ఇలా బికినీ బీచ్ లో అషు బ్యాక్ లెస్ ఫోజ్ తో అద‌ర‌గొట్టింది. బ్లూ క‌ల‌ర్ ఫ్లోర‌ల్ ఫ్రాక్ ఆల్మోస్ట్ బ్యాక్ లెస్ గా డిజైన్ తో అషు అందాల‌ను ఒక రేంజులో ఎలివేట్ చేస్తోంది.

ఈ లుక్ చూడ‌గానే ఫ్యాన్స్ స్ట‌న్నింగ్ అషు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బీచ్ లో ఒక రేంజులో చెల‌రేగిపోయిందంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యువ‌త‌రంలో వైర‌ల్ గా షేర్ అవుతోంది.

జీవితంలో ఇది మ‌రో కోణం:

మూడు నెలల క్రితం తెలుగు పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కుంభకోణంలో అషు రెడ్డి పేరు వినిపించింది. డ్రగ్స్ రాకెట్‌లో ప్రధాన నిందితుడు, నిర్మాత కెపి చౌదరికి ఆశు రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. మాజీ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అషు ఈ ఆరోపణలను ఖండించగా ఈ మొత్తం వ్య‌వ‌హారం అభిమానులు, పరిశ్రమకు షాక్ ఇచ్చింది. వీట‌న్నిటినుంచి బ‌య‌ట‌ప‌డి తెలుగు నటి, హోస్ట్ అయిన‌ ఆషు రెడ్డి ప్రస్తుతం వెకేష‌న్స్‌లో సేదదీరుతోంది.

ఆస్ట్రేలియాలో తన సమయాన్ని ఆస్వాధిస్తోంది. ఆషు రెడ్డి గత నెలలో లండన్‌లో ఉన్నారు. అక్కడ నుండి వ‌రుస ఫోటోషూట్ల‌ను సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయ‌గా వాటికి అద్భుత స్పంద‌న ద‌క్కింది. గత 4 రోజులుగా ఈ బ్యూటీ ఆస్ట్రేలియాలో ఉంది. అక్కడ నుండి కూడా వరుస ఫోటోలను పోస్ట్ చేస్తోంది. అషు షేర్ చేసిన తాజా ఫోటోలో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది.

సినీ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు ఆషు USలోని ఒక IT సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం చేసార‌నే విష‌యం చాలా మందికి తెలియదు. గ‌త‌ ఇంటర్వ్యూలో అషు ఈ విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసింది. తాను ఒకప్పుడు ఐటీ పరిశ్రమలో ఆమె ఉద్యోగం చేస్తూ రూ.1.20 లక్షల జీతాన్ని నెల‌కు డ్రా చేసాన‌ని తెలిపారు. ఆషు సింహాచలం అన్నదాన సత్రం ట్రస్ట్‌కు త‌న మొదటి జీతం ఇచ్చింది. తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించడం పూర్తిగా యాధృచ్చికం అని తెలిపింది.

Tags:    

Similar News