ఏడేళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ మేకర్ ముఖానికి రంగు!
బాలీవుడ్ స్టార్ మేకర్ అశుతోష్ గోవారికర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లగాన్'..'పానిపట్'..'జోదా అక్బర్' లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన గ్రేట్ మేకర్
బాలీవుడ్ స్టార్ మేకర్ అశుతోష్ గోవారికర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లగాన్'..'పానిపట్'..'జోదా అక్బర్' లాంటి చిత్రాల్ని తెరకెక్కించిన గ్రేట్ మేకర్. దర్శకుడిగానే కాకా నటుడిగానూ మెప్పించారాయన.' 'హోలి' నుంచి 'వెంటిలేటర్' వరకూ నటుడిగా ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. తాజాగా ఆయన మరో సర్వైవల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
'కాలాపాని' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమీర్ సక్సెనా తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత అశుతోశ్ గోవారికర్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ మధ్యలో చాలా అవకాశాలు వచ్చినా ఆపాత్రలేవి తనకు అంతగా నచ్చలేదని ఆ కారణంగానే సినిమాలు చేయలేదన్నారు. అయితే ఇలాంటి సినిమాలో నటిస్తే తనకెంతో బాగుంటుందని భావించి సినిమా ఒప్పుకున్నట్లు తెలిపారు.
' ఈ పాత్ర నేను చేయగలను దీనికి నేను మాత్రమే న్యాయం చేస్తానని అనిపిస్తే.. కచ్చితంగా ఆ పాత్రలో నటిస్తాను. ఈ పాత్రలో రచయిత ఊహించిన దానికంటే ఎక్కువగా సహకారం అందించాలి. ఈ కథతో టీమ్ నాదగ్గరకు వచ్చినప్పుడు ఇందులో నాకు నాలుగు అంశాలు కనిపించాయన్నారు. నేను సమీర్ సక్సెనా ఓటీటీ చిత్రాలకు వీరాభిమానిని. ఇది ఒక అభిమాని మధుర క్షణాలు..రెండోది సర్వైవల్ డ్రామా.
మూడోది నెట్ ప్లిక్స్ లో రాబోతుంది. అన్నింకంటే ముఖ్యమైనది ఇందులో నేను పోషించిన పాత్ర నాకెంతో నచ్చింది. అందుకే ఈ కథలో నటించడానికి ఒకే చెప్పాను. ఇందులో నేను అండమాన్ నికోబాదర్ గవర్నర్ లెప్ట్ నెంట్ జిబ్రాన్ ఖాద్రీ పాత్రలో కనిపిస్తాను' అని అన్నారు. ఇక దర్శకుడిగా ఆయన 2019లో 'పానిపట్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈసినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాకి దర్శకత్వం వహించలేదు. అంతకు ముందు భారీ అంచనాలతో మోఘల్ సామ్రజ్యం కథని ఆధారంగా చేసుకుని భారీ కాన్సాస్ పై 'జోదా అక్బర్' తెరకెక్కించారు. అది నిరాశనే మిగిల్చింది. 'లగాన్' విజయంతో మాత్రం తానేంటే అందరిక తెలుసు.