అశ్వనీదత్ మాటతో.. ప్రభాస్ ఫ్యాన్స్ కు అంత టెన్షన్ ఎందుకు?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాణంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాణంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ క్యాస్టింగ్, హాలీవుడ్ హంగులతో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. రూ.600 కోట్లకు పైగా ఆయన వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఎదురుచూస్తున్న కల్కి చిత్రం.. జూన్ 27న విడుదల కానుంది.
వాస్తవానికి ఈ సినిమా వేసవి కానుకగా మే9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు ఇతర కారణాల వల్ల మేకర్స్ జూన్ కు వాయిదా వేశారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే కల్కి సినిమాకు ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. అందుకు అశ్వనీదత్ మాటే కారణమని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమికి మద్దతుగా సినీ రంగానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. ఇప్పుడు అశ్వనీదత్ కూడా తెలుగుదేశం పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.
"నారా చంద్రబాబు నాయుడు గారి విజయం.. రేపటి విద్యార్థుల భవిష్యత్ కోసం.. రేపటి యువత ఉపాధి కోసం" అంటూ అశ్వనీదత్ రాసుకొచ్చారు. అయితే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే అశ్వనీదత్ ట్వీట్ వల్ల కల్కి సినిమాకు టికెట్ల పెంపు విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. థియేటర్లను సీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పలు సినిమాల విషయంలో ఇదే జరిగిందని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అశ్వనీదత్ ఎప్పటి నుంచో టీడీపీకి మద్దతు ఇస్తున్నారని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా ఆయన స్పందించినట్లు చెబుతున్నారు. కొత్తగా ఆయనేం సీబీఎన్ కు సపోర్ట్ చేయడం లేదని అంటున్నారు. రాజకీయాల్లో అభిప్రాయాలు, సినిమాల ప్రొడక్షన్ వేర్వేరు అని చెబుతున్నారు. ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా.. ఒక్క ట్వీట్ వల్ల ఆ పార్టీ ఎలాంటి ఇబ్బందులు పెట్టదేమోనని అంటున్నారు.
ఎందుకంటే ప్రభాస్ సైడ్ నుంచి చూస్తే అతను ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లను పాలిటిక్స్ ను పెద్దగా టచ్ చేసింది లేదు. మంచి వ్యక్తీగానే అందరిలో గుర్తింపు అందుకున్నాడు. కాబట్టి పొలిటికల్ గా ప్రభాస్ సినిమాను ఎవరు కూడా చూడరు. అంతే కాకుండా ఇలాంటి సినిమా తెలుగు వారి స్థాయిని పెంచేదిగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతుంది. సపోర్ట్ వచ్చినా రాకపోయినా ఎవరు ఇబ్బంది అయితే పెట్టారని తెలుస్తోంది.