సౌత్ లో ఛాన్సుసొస్తే దూకేయడానికి రెడీ!
తాజాగా యువ నటుడు ఆయుష్మాన్ కూడా ఖురానా కూడా సౌత్ లో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని ఆశాభావం వ్యక్తం చేసాడు.
దేశంలోనే నెంబవర్ వన్ ఇండస్ట్రీ గా టాలీవుడ్ దూసుకుపోతుంది. తెలుగు సినిమా పాన్ ఇండియా సక్సెస్ తోనే అది సాధ్యమైంది. కన్నడ..మలయాళ పరిశ్రమల కూడా వరుస విజయాలతో ముందుజలో ఉంది. ఇక కోలీవుడ్ లెక్క వేరే. వాళ్లే ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల నుంచి దర్శకులు అంతా తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరోలు కూడా ఛాన్సు వస్తే మేము సై అంటున్నారు.
ఇప్పటికే అమితాబచ్చన్..సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు లాంచ్ అయ్యారు. ఇంకా అర్జున్ రాంపాల్.. నవాజుద్దీన్ సిద్దిఖి లాంటి నటులు కూడా తెలుగు సినిమాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్..హృతిక్ రోషన్ లాంటి వారు క్యూడా క్యూలో ఉన్నారు. రాజమౌళి ఛాన్సు ఇస్తే దూకేయడానికి సిద్దంగా ఉన్నారు ఆ ఇద్దరు. ఇటీవలే షారుక్ ఖాన్ కూడా తన మనసులో మాటని బటయ పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ తో నటించాలి ఉందన్న కోర్కెను బయట పెట్టారు.
తాజాగా యువ నటుడు ఆయుష్మాన్ కూడా ఖురానా కూడా సౌత్ లో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని ఆశాభావం వ్యక్తం చేసాడు. సరైన కథ కుదిరితే సౌత్ కి వచ్చి సినిమాలు చేస్తానన్నారు. 'దర్శకుడు అట్లీతో పనిచేయాలని ఉంది. అతని కథలు కమర్శియల్ గా ఉంటాయి. నటుల్ని కొత్త పంథాలో తెరపై చూపించ డంలో అతనికంటూ ఓ యూనిక్ స్టైల్ ఉంది. అందుకే అతనికి బాగా కనెక్ట్ అయ్యాను. తెలుగు సినిమాలు కూడా చేయాలని ఉంది. ఇటీవలి కాలంలో కొత్త కంటెంట్ ఎక్కువగా తెలుగు నుంచే వస్తుంది' అని అన్నారు.
మొత్తానికి ఆయుష్మాన్ కి ఛాన్స్ వస్తే టాలీవుడ్ లో దూకేయడానికి సిద్దంగా ఉన్నడని తెలుస్తుంది. విక్కీ డోనర్ తో బాలీవుడ్ కి పరిచయమైన ఆయుష్మాన్ తొలి సినిమానే మంచి గుర్తింపును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 'ఆర్టికల్ '15..అందాధున్' లాంటి సినిమాలు ఆ కీర్తిని రెట్టింపు చేసాయి. నటుడిగా తనకంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీని వేసుకున్నాడు. ఆయుష్మాన్ నటించిన హిందీ సినిమాలు కూడా సౌత్ లో రీమేక్ అయ్యాయి.