పవన్ ఉస్తాద్‌... హిందీ వర్షన్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

కేవలం మూడు నెలల్లో ముగించి విడుదల చేస్తానంటూ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడు.

Update: 2024-06-27 11:30 GMT

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభం అయిన సినిమా ఉస్తాద్‌ భగత్ సింగ్. తమిళ సూపర్ స్టార్‌ విజయ్ నటించిన హిట్ మూవీ తేరి కి ఉస్తాద్‌ భగత్‌ సింగ్ రీమేక్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా నిర్మాణం మొదలు పెట్టారు.

కేవలం మూడు నెలల్లో ముగించి విడుదల చేస్తానంటూ దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడు. కానీ ఆ మూడు నెలల డేట్లను కూడా పవన్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కేవలం పది నుంచి పదిహేను రోజుల షూట్ మాత్రమే పూర్తి అయ్యింది. బ్యాలన్స్ షూట్‌ ఇంకా చాలా ఉందని సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి, అంతే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేయాల్సిన సినిమాలను పూర్తి చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సగానికి పైగా పూర్తి అయిన సినిమాలకు ఏదో ఒక విధంగా డేట్లు ఇస్తాడనే టాక్ వినిపిస్తుంది.

తేరి సినిమా తెలుగు రీమేక్‌ పరిస్థితి ఉందా? లేదా? అన్నట్టుగా ఉంటే, హిందీ రీమేక్ మాత్రం రెడీ అవుతోంది. వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రీమేక్ కు 'బేబీ జాన్‌' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు అట్లీ హిందీలో రీమేక్ ను నిర్మిస్తూ ఉంటే, కలీస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా బేబీ జాన్ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తమిళ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి గతంలో మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుకు ఈ సినిమా కూడా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

బేబీ జాన్ సినిమా కంటే ముందు పవన్ ఉస్తాద్‌ భగత్ సింగ్ వస్తుంది అని అంతా భావించారు. కానీ పవన్‌ ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదు. పవన్‌ డేట్లు కుదుర్చుకుని ఈ సినిమా షూటింగ్‌ కు హాజరు అయితే వచ్చే ఏడాదిలో సినిమా వస్తుందేమో చూడాలి.

ఇప్పటికే తమిళ్‌ లో వచ్చింది, త్వరలో హిందీలో రాబోతుంది.. కనుక తెలుగు వెర్షన్ కి ఆధరణ ఉంటుందో లేదో అనే అనుమానాలు ఉంటాయి. కనుక సినిమా మొత్తాన్ని అటకెక్కించే అవకాశాలు కూడా లేకపోలేదు అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్‌ ఉస్తాద్‌ పై కంటే ఇతర సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.

Tags:    

Similar News