కల్ట్ బొమ్మకి అతి పెద్ద సవాల్ ఇది!
అదే నమ్మకంతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు కొన్ని అక్కడా రీమేక్ అయ్యాయి. కానీ వాటి ఫలితాలు మాత్రం ఏమంత ఆశాజనకంగా కనిపించలేదు.
బాలీవుడ్ లో తెలుగు సినిమాలు రీమేక్ అయి హిట్టైన సినిమాలు చాలానే ఉన్నాయి. డబ్బింగ్ రూపంలోనూ టాలీవుడ్ సినిమాలు అక్కడి ప్రేక్షకుల్ని బాగాలే అలరించాయి. అయితే కొంత కాలంగా తెలుగు సినిమాలకు అక్కడ సక్సెస్ రేట్ తగ్గింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమా ఫలితాలే మేకర్స్ ని కంగారు పెడుతున్నట్లే కనిపిస్తోంది. `అర్జున్ రెడ్డి` హిందీ లో `కబీర్ సింగ్` గా రీమేక్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అదే నమ్మకంతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు కొన్ని అక్కడా రీమేక్ అయ్యాయి. కానీ వాటి ఫలితాలు మాత్రం ఏమంత ఆశాజనకంగా కనిపించలేదు. నాని నటించిన `జెర్సీ`..`బన్నీ` నటించిన `అల వైకుంఠ పురములో`.. అంతకు ముందు `హిట్` సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. కానీ అక్కడ మాత్రం అంచ నాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పుడిదే టెన్షన్ `బేబి` టీమ్ ని సైతం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవలే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో హీరో..హీరోయిన్..నటీనటులు మారుతున్నారు తప్ప మిగతా టీమ్ అంతా ఇక్కడి వారే. సాయి రాజేష్ దర్శకత్వంలోనే రీమేక్ అవుతోంది. `కల్ట్ బొమ్మ` అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా రిలీజ్ అయి వంద కోట్లకు పైగా వసూళ్లని సాధించింది.
దీంతో ఈ సినిమా నిర్మాతలు బాగా లాభపడ్డారు. అదే నమ్మకంతో ఇదే కంటెంట్ ని హిందీకి తీసుకెళ్లి అక్కడా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ తాజా వైఫల్యాలన్నీ `బేబి` టీమ్ ని కాస్త ఆందోళనకి గురి చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక్కడ హిట్ అయిన సినిమాలు అక్కడ ఎందుకు పోయినట్లు? మన సినిమాకి అలాంటి పరిస్థితి ఎదురవుతుందా? ఒకవేళ అలాంటి నెగివిటీ వస్తే దాన్ని ఎలా అధిగమించిముందుకు వెళ్లాలి? అన్న దానిపైనా మేకర్స్ సీరియస్ గానే ఆలోచన చేస్తున్నట్లు సమాచా రం. ఏది ఏమైనా ముందు చూపు మంచిదే.