బాలయ్య 109 బిగ్గెస్ట్‌ అప్‌డేట్‌

2025 సంక్రాంతికి బాలకృష్ణ 109వ సినిమా రాబోతుంది. చిరంజీవి విశ్వంభర తో పాటు పలు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి.

Update: 2024-09-14 06:49 GMT

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్నాడు. వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్‌ అంతా చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే బాలయ్య 109 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా బాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాలయ్య సినిమాను రూపొందిస్తున్నాడు.

బాలకృష్ణ మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెల్సిందే. ఆ ఎన్నికల ముందే షూటింగ్‌ పూర్తి చేయాలని భావించినా కూడా రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల బాలయ్య డేట్లు ఇవ్వలేదు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ షూటింగ్ లో పాల్గొంటాడని అంతా భావించినా అది సాధ్యం కాలేదు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమా ను ఈ దసరాకు విడుదల చేయాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు డిసెంబర్‌ లో బాలయ్య 109 రాబోతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో బిగ్‌ అప్‌డేట్‌ వస్తోంది.

2025 సంక్రాంతికి బాలకృష్ణ 109వ సినిమా రాబోతుంది. చిరంజీవి విశ్వంభర తో పాటు పలు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. అయితే అందులో రవితేజ సినిమా వచ్చే పరిస్థితి లేదు. షూటింగ్‌ పూర్తి కాక పోవడంతో పాటు, ఇటీవల రవితేజ కు యాక్సిడెంట్‌ అయింది. ఆయన కోలుకుని షూటింగ్‌ కు హాజరు అవ్వడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. కనుక సంక్రాంతికి ఆయన సినిమా వచ్చే అవకాశాలు దాదాపు అసాధ్యం. అందుకే బాలయ్య 109వ సినిమా తో రవితేజ సినిమా ప్లేస్ ని భర్తీ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2025 సంక్రాంతికి మరోసారి చిరంజీవి, బాలయ్య లు పోటీ పడబోతున్నారు. వీరితో పాటు వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ముగ్గురు హీరోల సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. ఈ మూడు మాత్రమే కాకుండా తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్ నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News