ప్రారంభానికి ముందే చెక్ పెట్టిన హీరోలు!

స్టార్ హీరోల సినిమాలు మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం అన్న‌ది చాలా రేర్. ఎంతో బ‌ల‌మైన కార‌ణాలుంటే త‌ప్ప మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం అన్న‌ది జ‌ర‌గ‌దు.

Update: 2024-06-19 07:20 GMT

స్టార్ హీరోల సినిమాలు మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం అన్న‌ది చాలా రేర్. ఎంతో బ‌ల‌మైన కార‌ణాలుంటే త‌ప్ప మ‌ధ్య‌లో ఆగిపోవ‌డం అన్న‌ది జ‌ర‌గ‌దు. కార‌ణాల విష‌యానికి వ‌స్తే ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. క్రియేటివి డిప‌రెన్స్ కావొచ్చు. ఆర్దిక ఇబ్బందులు కావొచ్చు. ప్రధానంగా ఈ రెండు కార‌ణ‌ల‌తో ప్రాజెక్ట్ లు బ్రేక్ అవుతుంటాయి. అయితే ఈ ర‌కంగా గ‌తంలో జ‌రిగేది. ఇలాంటి కార‌ణాల‌తో ఇప్పుడు అలాంటి ప‌రిస్థితులు పెద్ద‌గా చోటు చేసుకోవ‌డం లేదు. ఆ మ‌ధ్య మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-కొర‌టాల శివ ప్రాజెక్ట్ మాత్రం ప్రారంభోత్స‌వం అనంత‌రం ఆగిపోయింది.

ఆ సినిమా రెగ్యుల‌ర్ షూట్ మొద‌లు కాక‌పోవ‌డంతో న‌ష్టాల నుంచి బ‌య‌ట పడింది. లేదంటే నిర్మాత‌కి భారీ న‌ష్టం త‌ప్పేది కాదు. తాజాగా మ‌రికొన్ని కాంబినేష‌న్లు ప్రారంభోత్స‌వానికి కూడా ఛాన్స్ లేకుండా ముందుగానే ఓ మాట అనేసుకుని ఆగిపోయిన‌ట్లు తెలుస్తోంది. నేచుర‌ల్ స్టార్ నాని క‌థ‌నాయ‌కుడిగా బ‌లగం వేణు ద‌ర్శ‌క‌త్వంలో `ఎల్ల‌మ్మ` అనే సినిమాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌డానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడీ సినిమా ఆగిపోయింద‌ని స‌మాచారం.

`ఎల్ల‌మ్మ` క‌థ‌..శ్రీకాంత్ ఓదెల నానికి చెప్పిన క‌థ స‌మీపంగా ఉండ‌టంతో వేణు ప్రాజెక్ట్ ని ఆపేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అదే నిజ‌మైతే వేణు మ‌రో క‌థ‌తో నానిని ఒప్పించాల్సి ఉంటుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోవ‌డానికి చాలా కార‌ణాలు వినిపిస్తున్నాయి. బ‌న్నీకి స్టోరీ న‌చ్చ‌లేద‌ని, అట్లీ భారీ గా పారితోషికం డిమాండ్ చేసాడ‌ని, బాలీవుడ్ హీరోల రాజ‌కీయాలు ఉన్నాయ‌ని ఇలా కొన్ని కార‌ణాలు వైర‌ల్ అవుతున్నాయి.

అందులో స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. అలాగే ర‌వితేజ‌-గోపీచంద్ మ‌లినేని కూడా ఓ సినిమా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా బ‌డ్జెట్ కార‌ణంగా ఆగిపోయిందంటున్నారు. వ‌రుస వైఫ‌ల్యాల‌తో ఉన్న ర‌వితేజ పై ఇప్పుడంత బ‌డ్జెట్ పెడితే న‌ష్ట‌మ‌ని భావించిన నిర్మాత వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అలాగే సాయితేజ్- సంత‌ప్ నందిల సినిమా `గాంజా శంక‌ర్` కూడా బ‌డ్జెట్ కార‌ణంగా ఆగిపోయింద‌ని ఇప్ప‌టికే ప్రచారంలో ఉంది. అయితే ఇవేవి ప్రారంభోత్స‌వం కూడా చేసుకోలేదు. దీంతో ఆ సినిమాల‌కు ఆ ర‌క‌మైన న‌ష్టం కూడా ఎదుర‌వ్వ‌లేదు. మొద‌లై ఆగిపోవ‌డం కంటే ముందే ర‌ద్ద‌వ్వ‌డం అన్న‌ది మంచి విష‌య‌మే.

Tags:    

Similar News