భగవంత్ కేసరి.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలంటే??
నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ఈనెల 20వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. పోటీగా మరోవైపు రెండు క్రేజీ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ఈనెల 20వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. పోటీగా మరోవైపు రెండు క్రేజీ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ అందుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే అనిల్ రావిపూడి మొదటిసారి బాలయ్య బాబు ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ తో సినిమా చేయడం వలన సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది.
అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనే విధంగా ఫాన్స్ నమ్మకాన్ని అయితే పెంచుకున్నారు. కాబట్టి సినిమా మొదటి రోజు ఎలాంటి టాక్ అందుకుంటుంది అనేది ఈ సినిమా బాక్సాఫీస్ పై ఆధారపడి ఉంటుంది. ఇక నిర్మాతలు ఈ సినిమాను భారీగానే విడుదల చేస్తున్నారూ.
భగవంత్ కేసరి సినిమా ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఎప్పటిలాగే బాలయ్య బాబు మరోసారి డామినేట్ చేసే విధంగా 14.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో 13 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, నెల్లూరులో 2.6 కోట్లు, గుంటూరులో 6 కోట్లు, కృష్ణలో 4 కోట్లు.. ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా భగవంత్ ఊహించని స్థాయిలో 57 కోట్ల రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే ఆ రూట్లో భగవంత్ సినిమా 4.25 కోట్ల ధర పలకగా ఓవర్సీస్ లో 6 కోట్ల వరకు బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా భగవంత్ కేసరి 67 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. బాలయ్య సినిమాల్లో అత్యధికంగా బిజినెస్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 68 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. ఒక విధంగా ఈ టార్గెట్ పెద్దదే కాని సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా ఈ దసరా సెలవుల్లో టార్గెట్ ను అయితే తొందరగా ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి బాలయ్య అనిల్ రావిపూడి మ్యాజిక్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.