భగవంత్ కేసరి కీ పాయింట్స్ ఇవే..!
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమా నిర్మించారు
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమా నిర్మించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ వెల్లడించారు అనీల్ రావిపుడి. భగవంత్ కేసరి సినిమా కథ సినిమాలోని కీ పాయింట్స్ అన్ని రివీల్ చేశారు అనీల్ రావిపుడి.
ఈ సినిమా కథ నాలుగు పాత్రల మధ్య జరుగుతుందని ఆయన అన్నారు. మొదటి పాత్ర విజ్జి పాత్ర అని.. ఆ పాత్ర ఎమోషన్ ఆమెను ఒక గోల్ వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో భగవంత్ కేసరి ఏం చేశాడన్నది తెలుస్తుంది. రెండో పాత్ర రాహుల్. భగవంత్ కేసరితో అతని యుద్ధం ఓ రేంజ్ లో ఉంటుంది. రాహుల్ పాత్రలో అర్జున్ రాంపాల్ ఎక్స్ ట్రా ఆర్డినరీ గా పనిచేశారు. సినిమా కథ అనుకున్నప్పుడే అతను ఆలోచనలోకి వచ్చారు. సినిమా కోసం ఆయన సొంత డబ్బింగ్ చెప్పారు. తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పడం ఆయన డెడికేషన్ ఏంటన్నది తెలుస్తుందని అన్నారు అనీల్ రావిపుడి.
ఇక సినిమాలో సైకాలజిస్ట్ గా కాజల్ నటిస్తుంది. విజ్జి పాత్ర డ్రైవ్ చేసే క్రమంలో కాజల్ బాగా చేసింది. బాలకృష్ణతో కాజల్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ టీజింగ్ చేస్తూ సెటిల్డ్ గా ఎంటర్టైన్ చేస్తారని అన్నారు అనీల్ రావిపుడి. కథలో ఒక కీ మూమెంట్ కాజల్ అని అన్నారు. వీటితో పాటుగా భగవంత్ కేసరి పాత్రని పుష్ చేసే జైలర్ శరత్ కుమార్ జయ చిత్ర పాత్రలు కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఈ ఐదు పాత్రల మధ్య వరల్డ్ ఆఫ్ భగవంత్ కేసరి ఉంటుందని అన్నారు. హై యాక్షన్ ఎమోషన్స్ తో సినిమా వస్తుందని అన్నారు.
బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగా మాస్ లో ఆయనకుండే ఫాలోయింగ్ వేరే లెవెల్. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాలో ఎవరీ మూమెంట్ ఎంజాయ్ చేశా ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తానని అన్నారు ఆనీల్ రావిపుడి. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని సినిమా బి జి ఎం తో మరోసారి తమన్ తన మార్క్ చాటుతాడని అన్నారు అనీల్ రావిపుడి.