భగవంత్ కేసరి.. ఈ లెక్క ఇప్పట్లో ఆగేలా లేదు

నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో ఆశ్చర్యపరుస్తోంది

Update: 2023-10-27 09:33 GMT

నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు టైగర్ నాగేశ్వరరావు మరొకవైపు విజయ్ లియో సినిమా హై లెవెల్ బజ్ తో ఒకేసారి విడుదల అయ్యాయి. ఇంత పోటీలో కూడా నందమూరి బాలకృష్ణ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అనిల్ రావిపూడి మేకింగ్ విధానం మరోసారి కమర్షియల్ ప్రేక్షకులకు అన్ని రకాలుగా అట్రాక్ట్ చేస్తోంది.

దసరా సెలవులు ముగిసిన తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా కొనసాగుతూ ఉండడం విశేషం. చూస్తుంటే ఈ వీకెండ్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 8వ రోజు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాలు వెళితే.. 8వ రోజు ఏరియాల వారిగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజం లో 75 లక్షలు, వైజాగ్ లో 38.94 లక్షలు, సీడెడ్ లో 35 లక్షలు నెల్లూరులో 75 లక్షలు, ఈస్ట్ గోదావరి లక్షలు, వెస్ట్ లో 7.22 లక్షలు కృష్ణ లో 11.8 లక్షలు, గుంటూరులో 6.29 లక్షలు రాగా కర్ణాటకలో 10 లక్షలు ఓవర్సీస్ లో 11 లక్షలు షేర్ కలక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఎనిమిదవ రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 2.18 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక 8వ రోజుల్లో మొత్తంగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

భగవత్ కేసరి నైజాంలో 14.75 కోట్లు రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో 4.92 కోట్లు, సీడెడ్ లో 11.8 కోట్లు, నెల్లూరులో 2.02 కోట్లు ఈస్ట్ లో 2.68 కోట్లు, వెస్ట్ లో 2.37 కోట్లు, కృష్ణ లో 2.94 కోట్లు, గుంటూరులో 5.31 కోట్లు షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాలలో 4.7 కోట్లు రాగా ఓవర్సీస్ నుంచి 7.11 కోట్లు వచ్చాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో భగవంత్ కేసరి సినిమా 58.61 కోట్లు షేర్ కలెక్షన్స్ రాబట్టి బాలయ్య బాబు కెరీర్ లో అత్యధిక షేర్ కలక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇక ఈ శుక్రవారం కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వీకెండ్స్ లో కూడా నెంబర్లు మరింత పెరగవచ్చు.

Tags:    

Similar News