డెయిరీ మిల్క్‌ బ్యూటీ అప్పుడే మూడు..!

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న విషయం తెల్సిందే

Update: 2024-06-18 16:17 GMT

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా లో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న విషయం తెల్సిందే. పుణె కు చెందిన భాగ్య శ్రీ బోర్సే స్టార్ మోడల్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

డెయిరీ మిల్క్ యాడ్ ద్వారా చాలా పాపులారిటీని సొంతం చేసుకున్న భాగ్య శ్రీ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌ సినిమాలను వరుసగా కమిట్‌ అవుతుంది. ఇటీవల బాలీవుడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు తెలుగు లో ఏకంగా మూడు సినిమాలు చేస్తుంది.

మిస్టర్ బచ్చన్‌ సినిమా విడుదల అవ్వకుండానే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ లో ఈ భాగ్య శ్రీ నటిస్తుంది. ఈ మధ్య కాలంలో విజయ్‌ తో నటించే అవకాశం కోసం స్టార్‌ హీరోయిన్స్‌ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి ఛాన్స్ ఈ అమ్మడికి దక్కింది.

ఆ రెండు కాకుండా ఇటీవలే నాని హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక భారీ సినిమాలో కూడా భాగ్య శ్రీ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్‌ అవ్వలేదు. త్వరలోనే ఈ మూడు సినిమాల గురించి స్వయంగా భాగ్య శ్రీ బోర్సే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు కూడా హిట్‌ అయితే ఖచ్చితంగా టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలను ఈ అమ్మడు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ మరిన్ని ఆఫర్లను తెచ్చి పెడుతున్నాయి.

Tags:    

Similar News