నాన్నని డాక్టర్ గా చూడటమే ఇష్టం!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి సుపరిచితుడే. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో నటించారు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి సుపరిచితుడే. దాదాపు రెండు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో నటించారు. నటుడిగా తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. నెగిటివ్ రోల్స్ ..పాజిటివ్ రోల్స్ పాత్ర ఏదైనా భరత్ అంటే తెలియని ప్రేక్షకుడు లేరు. ఒక 'వి చిత్రం'తో నటుడిగా పరిచయమైన భరత్ మొన్నటి విజయ్ దేవరకొండ 'ఖుషీ' వరకూ ఎంతో దిగ్విజయంగా సాగింది.
ఇక భరత్ నటుడి కంటే ముందు గొప్ప కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్న సంగతి చాలా మందికి తెలిసిన విషయం. డాక్టర్ వృత్తి నుంచి సినిమాల్లోకి వచ్చారు. అలాగని తెల్లకోట్ వదల్లేదు. డాక్టర్ గానూ సేవలందిస్తున్నారు. మరి భరత్ ఫ్యామిలీ విశేషాలు ఏంటి? అంటే? ఆయనకు ఇద్దరు కొడుకులున్నారు. వారు ఇదిగో ఇలా ఉంటారు. ముగ్గురు చూడటానికి తండ్రికొడుకుల్లా లేరు. అన్నదమ్ముల్లా ఉన్నారు. బయట వారు చూసి బ్రదర్స్ అనే అనుకుంటారుట.
తండ్రికోడుకులు అని చెబితే తప్ప పోలిక చేయలేరని తనయుల మాటల్లో తెలుస్తోంది. తండ్రి లాగే కుమారులు కూడా మంచి ఫిట్ నెస్..ఫిజిక్ ని మెయింటెన్ చేస్తున్నారు. భరత్ డిసిప్లెన్ అంతా ఇంట్లో కుమారుల్లోనూ కనిపిస్తుంది. చిన్నోడు లక్ష్య బిటెక్ సెకెండ్ ఇయర్ చదువుతున్నాడు. పెద్దోడు పేరు జయ్ బీటెక్ థర్డ్ ఇయర్. ఇద్దరికీ సినిమాలంటే ఏమాత్రం ఆసక్తి లేదుట. కేవలం చూడటం వరకే పరిమితం అంటున్నారు.
కానీ చూడటం అంటే బాగా ఇష్టమట. నాన్నని నటుడిగా కంటే డాక్టర్ గా చూడటంలోనే ఎక్కువ సంతోషం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే? డాక్టర్ వృత్తి ప్రజలకు సేవలా కనిపిస్తుంది. వాళ్లకి ఎంతో దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది. నటుడిగా ఉంటే ఆ ఫీలింగ్ ఉండు అన్నది తనయుల అభిప్రా యంగా తెలుస్తోంది. ఇక భరత్ కి నటసింహ బాలయ్య తో మంచి రిలేషన్ షిప్ ఉందిట. పదేళ్లగా ఆయన బాగా తెలుసుట. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అంటున్నారు. అలాగే నాగార్జున కూడా అప్పుడప్పుడు హెల్త్ పరమైన సలహాలు తీసుకుంటారుట.