బిగ్ బాస్ 7 : అన్ ఫెయిర్ ఎలిమినేషన్.. ఉల్టా పుల్టా అంటే ఇదేనా..?
బిగ్ బాస్ సీజన్ 7 పదో వారం ఎలిమినేషన్ షూటింగ్ ప్రక్రియ పూర్తయింది.
బిగ్ బాస్ సీజన్ 7 పదో వారం ఎలిమినేషన్ షూటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక ప్రతి వారం లానే ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ముందుగానే లీక్ అవుతుంది. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది తెలిసిపోయింది. హౌస్ నుంచి ఈ వారం పాట బిడ్డ బోలే శావలి బిగ్ బాస్ హౌస్ కి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ ఓటింగ్స్ ప్రకారం రతిక, బోలే శావలి ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. రతిక దాదాపు ఎలిమినేట్ అవుతుందని అనుకోగా ఆమె బదులుగా బోలే శావలి ఎలిమినేట్ అయ్యాడు.
ఈ ఎలిమినేషన్ గురించి తెలియగానే బిగ్ బాస్ చేసింది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. రతిక కు అన్ అఫీషియల్ ఓటింగ్స్ లో తక్కువ ఓటింగ్ ఉందని కావాలని ఆమెను సేఫ్ చేసి బోలే శావలిని ఎలిమినేట్ చేశారని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు బోలే శావలి. ఇక నాలుగవ వారం ఎలిమినేట్ అయ్యి రీ ఎంట్రీ ఇచ్చింది రతిక.
ఆల్రెడీ రతిక ఈ సీజన్ ఆటని బయటకు వెళ్లి చూసి వచ్చింది. అయినా కూడా హౌస్ లో ఆమె అంత గొప్ప ప్రదర్శన చేయట్లేదు. ఆడకుండా హౌస్ లో ఉండే అర్హత ఆమెకు లేదని నామినేట్ చేస్తున్నారు కానీ బిగ్ బాస్ ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో భాగంగా రతికను కావాలనే సేఫ్ చేసి బోలే శావలిని ఎలిమినేట్ చేశారని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
అదీగాక మిగిలిన ఐదు వారాల్లో కనీసం నలుగురు లేడీ కంటెస్టెంట్స్ అయినా ఉండాలని కూడా రతికని ఎలిమినేట్ కాకుండా బోలే శావలిని ఎలిమినేట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ప్లాన్ ఏదైనా బలైంది మాత్రం బోలే శావలి. రతిక కన్నా అతనికి తక్కువ ఓట్స్ ఎలా వస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.