జీరో నుంచి హీరోగా ఎదిగిన రైతు బిడ్డ..!

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇంతకీ అసలు పల్లవి ప్రశాంత్ ఎవరు.

Update: 2023-12-18 11:19 GMT

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇంతకీ అసలు పల్లవి ప్రశాంత్ ఎవరు. అతను బిగ్ బాస్ లోకి ఎలా వచ్చాడు. బిగ్ బాస్ కి ముందు పల్లవి ప్రశాంత్ ఏం చేశాడు. ప్రశాంత్ కి ముందు పల్లవి అనే పేరు ఎందుకు ఉంది. ఇలాంటి ఎన్నో డౌట్లకు సమాధానం కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఇంతకీ అసలు పల్లవి ప్రశాంత్ బయోగ్రఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పల్లవి ప్రశాంత్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ జిల్లాలోని కొల్గూరులో నివసిస్తున్నాడు. తండ్రి సత్తయ్య ఒక రైతు. డిగ్రీ వరకు చదివిన పల్లవి ప్రశాంత్ కి చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉండటం వల్ల ఫ్రెండ్స్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి అందులో ఫోక్స్ సాంగ్స్ పాడుతూ వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్స్ మధ్య గొడవలు రావడంతో మళ్లీ లైఫ్ లో ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చింది.

ఒకానొక దశలో సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాడట పల్లవి ప్రశాంత్. ఇదే విషయం తన తండ్రితో చెబితే నువ్వు ఏదో ఒకటి చెయ్యి బిడ్డా నా సపోర్ట్ ఉంటుందని చెప్పారట. అయితే ఆ టైం లోనే బిగ్ బాస్ కి వెళ్లాలన్న ఆలోచన వచ్చింది. అయితే బిగ్ బాస్ కి కామన్ మ్యాన్ కేటగిరిలో గత రెండు సీజన్లలో ట్రై చేశాడు పల్లవి ప్రశాంత్. అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర సరిగా తిని తినక ఉన్న రోజులు కూడా ఉన్నాయట.

తండ్రి దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకుని హైదరాబాద్ వచ్చిన పల్లవి ప్రశాంత్ ఈరోజు అదే బిగ్ బాస్ విన్నర్ గా మారి ప్రైజ్ మనీ, బోలెడన్నీ సర్ ప్రైజ్ లు కూడా అందుకున్నాడు. బిగ్ బాస్ కి వెళ్తానని తన ఫ్రెండ్స్ కి చెబితే వాళ్లు నువ్వా బిగ్ బాస్ కి వెళ్లడమా అని ప్రశాంత్ ని హేళన చేశారట. అలా జీవితంలో బిగ్ బాస్ కి వెళ్లడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ ఫైనల్ గా సీజన్ 7 ఆడిషన్స్ కి రావడం అక్కడ సెలెక్ట్ అయ్యి ఫైనల్ విజేతగా నిలవడం తెలిసిందే.

బిగ్ బాస్ కి రాకముందు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రైతు బిడ్డగా తన పొలంలో పనుల గురించి రైతుల లైఫ్ స్టైల్ గురించి పల్లవి ప్రశాంత్ వీడియోస్ చేసేవాడు. అయితే ఆ టైం లోనే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్లాలని అనుకుంటున్నాడని దానికి మీ సపోర్ట్ కావాలని తన ఫాలోవర్స్ ని అడిగాడు. హౌస్ లోకి రాకముందే బిగ్ బాస్ కి పల్లవి ప్రశాంత్ వెళ్తే సపోర్ట్ చేయాలన్న ఆలోచన వారికి కలిగేలా చేశాడు.

ఇక ప్రశాంత్ పేరు ముందు ఉన్న ఆ పల్లవి ఎవరు అంటే. ప్రశాంత్ తండ్రి సత్తయ్య మహాబలిపురంలో పల్లవులు కట్టించిన గుడికి వెళ్లి కొడుకు పుడితే ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడట. అలా పల్లవి రాజు అని ముందు పేరు పెట్టి ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అని మార్చారట.

బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ఆటకి మరో కంటెస్టెంట్ శివాజి సపోర్ట్ అతన్ని గెలుపు బాట పట్టేలా చేసింది. శివాజి లేకపోతే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవ్వడం అంత ఈజీ అయ్యుండేది కాదు. శివాజి, యావర్, ప్రశాంత్ ముగ్గురు స్పై బ్యాచ్ గా నిలిచి స్టార్ మా బ్యాచ్ ని టార్గెట్ చేశారు. సీజన్ 7 టాప్ 5 లో శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ నిలవగా స్టార్ మా బ్యాచ్ నుంచి అమర్, ప్రియాంకా నిలిచారు. ఇక ఫైనల్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నరప్ గా నిలిచాడు.

Tags:    

Similar News