బిగ్ బాస్ 8 : నామినేషన్స్ లో సూపర్ సిక్స్.. డేంజర్ ఎవరికి..?

బిగ్ బాస్ సీజన్ 8 లో సండే ఎపిసోడ్ ఎంత ఎంటర్టైనింగ్ గా సాగుతుందో చివర్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అంత బాధగా ఉంటుంది.

Update: 2024-10-01 10:31 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో సండే ఎపిసోడ్ ఎంత ఎంటర్టైనింగ్ గా సాగుతుందో చివర్లో ఎలిమినేషన్ ప్రాసెస్ అంత బాధగా ఉంటుంది. కొన్నాళ్లు కలిసి హౌస్ లో ఉన్న వారు ఎలిమినేషన్ తో బయటకు వెళ్లడం కాస్త ఇబ్బంది పెట్టినా అదంతా ఒక ఆటలో భాగమే అని కన్విన్స్ అవుతారు. ఈ ఆదివారం అందరు అనుకున్నట్టుగానే సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ ఎలిమినేషన్ తో హౌస్ లో నిఖిల్, పృధ్వి కాస్త షాక్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో సోమవారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. ఈసారి హౌస్ లో ఉండటానికి అర్హత లేని ఫైర్ లేని ఇద్దరి కంటెస్టెంట్స్ ఫోటోలను ఫైర్ లో వేయాలి. సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఆరుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. మణికంఠ, నైనిక, నిఖిల్, విష్ణు ప్రియ, ఆదిత్య ఓం, నబీల్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది నామినేట్ చేసిన వారే నామినేషన్స్ లో ఉంటారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో మణికంఠ, నైనిక ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు. మణికంఠ మొదటి వారం నుంచి తన సింపతీ ఆట ఆడుతున్నాడని హౌస్ మెట్స్ భావిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఆటలో కన్ ఫ్యూజన్ కొనసాగిస్తున్నాడు. మరోపక్క మొదటి వారం క్లాన్ చీఫ్ అయిన నైనిక ఆ తర్వాత 3 వారాలు డల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి నెక్స్ట్ వీక్ అంటే ఐదో ఎలిమినేషన్ ఎవరన్నది వీకెండ్ తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సర్వైవల్ ఆఫ్ ఫిట్ అనే టాస్క్ ఇచ్చాడు. రెండు క్లాన్ లకు సంబంధించిన కంటెస్టెంట్స్ ఈ ఆటలో ఆడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఐదో ఎలిమినేషన్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నందున మణికంఠ, నైనిక ఎక్కువ పెర్ఫార్మ్ చేయాల్సి ఉంది.

Tags:    

Similar News