బిగ్ బాస్ 8 : బోర్ కొట్టిస్తున్న కంటెస్టెంట్.. ప్లాన్ మార్చాల్సిందే..!

ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అంతా కావాలని వాంటెడ్ గా గొడవ పెట్టుకున్నట్టుగానే అనిపించింది.

Update: 2024-11-13 10:21 GMT

బిగ్ బాస్ సీజన్ 8 ఆరంభం అదిరిపోగా మధ్యలో కొంత బోర్ అనిపించింది. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో షో కాస్త ఆసక్తికరంగా మారింది. వైల్డ్ కార్డ్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్ అనే విధంగా టాస్కులు గట్రా నడిచాయి. ఆ టైం లో కాస్త పర్వాలేదు అనిపించింది కానీ ఈమధ్య మళ్లీ షో అంత ఆసక్తికరంగా అనిపించట్లేదు. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ అంతా కావాలని వాంటెడ్ గా గొడవ పెట్టుకున్నట్టుగానే అనిపించింది.

బిగ్ బాస్ సీజన్ 8 లో 11వ వారం నామినేషన్ వెరైటీగా జరిగింది. ఈ నామినేషన్స్ లో తేజ కాస్త ఎక్కువ బరస్ట్ అవుట్ అయ్యాడు. ఫ్యామిలీ వీక్ కాబట్టి లాస్ట్ వీక్ తనను వరస్ట్ ప్లేయర్ గా మెజారిటీ ఓట్స్ రావడంతో అతని ఫ్యామిలీ హౌస్ లోకి రాదని నాగార్జున చెప్పినప్పటి నుంచి తేజ ఎప్పుడు టైం వస్తుందా బరస్ట్ అవుట్ అవుదామని చూస్తున్నాడు. అలానే నామినేషన్స్ లో పెద్ద పెద్దగా మాట్లాడాడు.

అతనికి తోడు కన్నడ వాళ్లను గ్రూప్ ఆట అంటూ గౌతం కూడా ఎటాక్ చేశాడు. పృధ్వితో గౌతం మాటల యుద్ధం తెలిసిందే. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆడియన్స్ కు ఎందుకో వాంటెడ్ గా చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. అందుకే షో మీద చిన్నగా ఆసక్తి తగ్గేలా చేసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో ఫ్యామిలీస్ హౌస్ లోకి రావడం మొదలు పెట్టారు. నబీల్ అమ్మ గారు హౌస్ లోకి వచ్చారు. ఆ తర్వాత రోహిణి మదర్ కూడా హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడారు.

ఫ్యామిలీ వీక్ అయితే ఇలానే కంటెస్టెంట్స్ కి సంబంధించిన వారు రావడం హౌస్ మెట్స్ తో కొంతసేపు తమ కంటెస్టెంట్ తో కొద్దిసేపు మాట్లాడి వెళ్తారు. ఈరోజు ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. యష్మి ఫాదర్ హౌస్ లోకి వచ్చారు. ఆయనతో హౌస్ మెట్స్ అంతా మాట్లాడిన ప్రోమో ఆకట్టుకుంది. యష్మి తన తండ్రిని చూసి బోరున ఏడ్చేసింది. సో ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం కూడా ఆడియన్స్ కు ఇలానే కాస్త ఎమోషనల్ ఫీలింగ్ తో పాటు కొద్దిగా బోర్ ఫీలింగ్ కూడా తెప్పిస్తుందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 8 మరో ఐదు వారాలు మాత్రమే ఉంది. టైటిల్ రేసులో నిలవాలంటే ఇంకాస్త టఫ్ ఫైట్ ఇవ్వాలి. ప్రస్తుతానికి టైటిల్ ఫేవరెట్ గా ఉన్నది ఎవరన్నది కూడా చెప్పడం కష్టమవుతుంది. మరి రాబోయే ఐదు వారాల్లో అయినా అది స్పష్టమవుతుందేమో చూడాలి.

Tags:    

Similar News