'బిగ్ బాస్ -7' అంతా కాంట్రవర్శీ కింగ్ లేనా?
దీంతో ఏడవ సీజన్ ని రక్తి కట్టించేలా నిర్వాహకులు సన్నదం చేస్తున్నారు. 'ఉల్టాపుల్టా' అనే ఓ కొత్త కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు.
'బిగ్ బాస్' గత రెండు సీజన్లు మిగతా సీజన్లతో పొల్చితే చప్పగా సాగిన సంగతి తెలిసిందే. మొదటి ఐదు సీజన్లు మంచి ఊపును తీసుకొస్తే ఐదు-ఆరు సీజన్లు మాత్రం లీకులతో వీకైపోయింది. విజేత ఎవరో ముందుగా తెలిసిపోవడం దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. అన్నింటికి మించి సరైన కంటెస్టెంట్లు లేకపోవడం ఇతర కారణాలతో వీక్ గా ముగిసింది. దీంతో ఏడవ సీజన్ ని రక్తి కట్టించేలా నిర్వాహకులు సన్నదం చేస్తున్నారు. 'ఉల్టాపుల్టా' అనే ఓ కొత్త కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు.
ఆదివారం షో అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తిచేసారు. 20 మందితో కూడిన లిస్టు కూడా సిద్దమైంది. అయితే ఇప్పుడీ జాబితాలోనూ అప్పటికప్పుడు కొన్ని రకాల మార్పులు చేస్తున్నట్లు వినిపిస్తుంది. కంటెస్టెంట్ ఏ మాత్రం వీక్ గా ఉన్నా వాళ్లను తప్పించి అప్పటికప్పుడు కొత్త వాళ్లని తీసుకుంటున్నారుట. దీంతో తుది జాబితాలో ఎవరుంటారో? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే ఎంపికైన వారిలో ఎక్కువ మంది కాంట్రవర్శీ కింగ్ లే అని వినిపిస్తుంది. అలాంటి వారు అయితేనే షోని ముందుకు తీసుకెళ్లగలరని భావించి వాళ్లనే మెజార్టీ పార్ట్‌లో ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లు వైఫల్యానికి కంటెంస్టెట్లు కూడా ఓ కారణమని విశ్లేషణలో తేలింది. ఈసారి అలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా హాట్ బ్యూటీ కిరణ్ రాథోడ్ పేరు లీకైంది. ఆమె కూడా సీజన్ 7 లో ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఆమె దూకుడు తనం గురంచి చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ గా కనిపించడం తో పాటు.. వివాదం వస్తే అదే రేంజ్ లో ఫైర్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఆమెని తీసుకున్నట్లు వినిపిస్తుంది. కిరణ్ రాథోడ్ 'హైస్కూల్'.. 'భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా' లాంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.