బిగ్ బాస్ కి హైకోర్టు నోటీసులు.. ఇకపై బుల్లి తెర కత్తెర!

సెప్టెంబర్‌ మొదటి వారంలో బిగ్‌ బాస్ సీజన్‌ 7 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నోటీసుల కారణంగా షో వాయిదా ఏమైనా పడే అవకాశం ఉందా అనేది చూడాలి.

Update: 2023-07-27 07:59 GMT

తెలుగు బిగ్‌ బాస్ నిర్వాహకులకు, హోస్ట్‌ నాగార్జునకు ఏపీ హైకోర్ట్‌ నోటీసులు జారీ చేయడం జరిగింది. షో లో కంటెంట్ వల్ల యూత్‌ చెడిపోతున్నారని.. అసభ్యతకు ఎక్కవ ఆస్కారం ఉంటుందని హైకోర్ట్‌ లో పిటీషనర్ వాదించిన నేపథ్యం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు నాగార్జున కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే నోటీసులకు సమాధానం ఇవ్వాలని మూడు పక్షాలను కోర్టు ఆదేశించింది.

త్వరలో బిగ్ బాస్ సీజన్‌ 7 ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కోర్టు నోటీసులతో ఏం జరుగబోతుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే బిగ్‌ బాస్ తో పాటు ఓటీటీ, బుల్లి తెర కంటెంట్ కు కచ్చితంగా సెన్సార్ ఉండాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా వస్తుందా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

సినిమాలకు ఉన్నట్లుగానే బుల్లి తెర కార్యక్రమాలకు.. ఓటీటీ సిరీస్‌ లు షో లకు సెన్సార్‌ ఉండాలి అనేది కష్టం అని.. అయితే ఓటీటీ లు ఇంకా ఛాన్స్ స్వీయ సెన్సార్‌ విధానంను అలవర్చుకోవాల్సిందిగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఎక్కువ శాతం ఓటీటీ లు ఈ స్వీయ సెన్సార్‌ ను పట్టించుకోవడం లేదు అనేది కొందరి విమర్శ.

ఓటీటీ లో వెబ్ సిరీస్ ల పేరుతో శృతి మించిన శృంగారం మరియు హింసను చూపిస్తున్నారు. అంతే కాకుండా బూతులు కూడా సిరీస్ ల్లో ఎక్కువగా పెడుతున్నారు. వాటిని పిల్లలు ముఖ్యంగా యూత్‌ చూసి చెడిపోతున్నారు అనేది ఆరోపణ. అందుకే సెన్సార్‌ ఉండటం వల్ల అన్ని విధాలుగా బాగుంటుంది అంటూ కొన్ని సంఘాల వారు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నాయి.

బిగ్ బాస్ అన్ని భాషల్లో కూడా ప్రారంభం అయిన సమయంలో.. ప్రారంభం కు ముందు కూడా విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. అయినా కూడా నిర్వాహకులు వాటిని పట్టించుకోకుండా వాటిని ప్రమోషన్ కోసం వినియోగించుకుంటూ తాము అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాయి.

అసభ్యంగా బిగ్‌ బాస్ లో కొన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా వాటిని ఉన్నది ఉన్నట్లుగానే చూపించడం జరుగుతుంది. ఇకపై ఇలాంటివి జరగకుండా కత్తెర పడే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ మొదటి వారంలో బిగ్‌ బాస్ సీజన్‌ 7 ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నోటీసుల కారణంగా షో వాయిదా ఏమైనా పడే అవకాశం ఉందా అనేది చూడాలి.

Tags:    

Similar News