ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద యాక్షన్ సీన్!
'నెల రోజుల పాటు పనిచేసి ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతి పెదద్ యాక్షన్ సీన్.
'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్'..'కేజీఎఫ్'..'రోబో' లాంటి సినిమాలు చూసిన తర్వాత వాటిలో ఉన్నంత భారీ యాక్షన్ ఇప్పటివరకూ ఏ సినిమా లో ఉండదన్నది చాలా మంది అభిప్రాయం. బాలీవుడ్ సినిమాలు కొన్నింటిలో ఉన్నప్పటికీ పాన్ ఇండియాలో అవి అంత ఫేమస్ కాలేదు. పాన్ ఇండియా దాటి..వరల్డ్ లో సైతం తెలుగు సినిమాలు కీర్తి పతాకాన్ని ఎగరవేయడంతో ఆ రీచ్ దక్కింది.
అయితే మాలీవుడ్ అంతకు మించి అనిపించేలా ప్లాన్ చేస్తోందా? యాక్షన్ సన్నివేశాలు తీయడంలో మేమే నెంబర్ అనే ప్రయత్నం చేస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం మలయాళ నటుడు మోహన్ లాల్ 'వృషభ' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'నెల రోజుల పాటు పనిచేసి ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతి పెదద్ యాక్షన్ సీన్. ఇంతవరకూ అలాంటి సన్నివేశాన్ని ఎవరూ తెరకెక్కించలేదు. ప్రేక్షకులు కూడా అలాంటి సన్నివేశం చూసి ఉండరు. ఈ సన్నివేశం సినిమా కేకాదు... భారతీయ సినిమా చరిత్రలో ఓ గొప్ప సన్నివేశంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఇందులో చాలా మంది నటులు కనిపిస్తారన్నారు.
యాక్షన్ సన్నివేశం ప్రత్యేకంగా స్టంట్ మాస్టర్లను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా వదిలారు. మోహన్ లాల్, రోషన్, శనయ కపూర్ తదితరులు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇందులో రాగిణి ద్వివేది.. సిమ్రన్.. గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు నిర్మించడం విశేషం. ఏక్తా కపూర్.. వరుణ్ మాథుర్.. అభిషేక్ వ్యాస్ లు నిర్మిస్తున్నారు. తెలుగు.. మలయాళం.. తమిళం.. హిందీ.. కన్నడ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది.