బాబి డియోల్ కి చిరాకు తెప్పించిన సందీప్ రెడ్డి!
'యానిమల్' బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి 1000 కోట్లు టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది
'యానిమల్' బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి 1000 కోట్లు టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది. ఆ మార్క్ సాధించడం యానిమల్ కి పెద్ద విషయమం కాదని ట్రేడ్ సైతం అంచనా వేస్తోంది. నెట్టింట యానిమల్ మేనియా అలా కొనసాగుతుంది. మార్కెట్ లో పోటీగా మరే సినిమా కూడా రిలీజ్ కి లేదు. 'డంకీ'..'సలార్' సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఇంకా రెండు..మూడు రోజులు సమయం ఉంది.
ఈ గ్యాప్ చాలు యానిమల్ దున్నేయడానికని టీమ్ భావిస్తోంది. మరోవైపు రిలీజ్ తర్వాత యానిమల్ నటుల సినిమాలో తమ పాత్రల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అంతకంతకు హైప్ తీసుకొస్తున్నారు. నటులు సహజంగా మాట్లాడినా అవి నెట్టింట సినిమాకి కోట్ల రూపాయాల పబ్లిసిటీని తీసుకొస్తున్నాయి. ఇటీవలే హీరో రణబీర్ కపూర్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించడానికి తానెంత ఇబ్బంది పట్టాడో తెలిపాడు.
కొన్ని సన్నివేశాలుచేసే టప్పుడు మనసు చంపుకుని నటించాల్సి వచ్చిందని...ఈ విషయంలో తన భార్య అలియాభట్ సహకారం లేకపోతే అంత బాగా నటించే వాడిని కాదని తెలిపాడు. రణబీర్ లాంటి నటుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇంతవరకూ ఎక్కడా చోటు చేసుకోలేదు. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాడు. కానీ తొలిసారి తన కృరమైన పాత్ర గురించి అలా వ్యాఖ్యానించడం అందర్నీ ఆలోచింజే సింది.
తాజాగా యానిమల్ విలన్ బాడి డియోల్ సైతం తన రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'షూటింగ్ మొదలయ్యాక కొన్ని సన్నివేశాల్లో నటించాలంటే నాకే ఇబ్బందిగా అనిపించింది. ఎందుకిలా చిరాగ్గా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నేను కేవలం ఓ పాత్రలో నటిస్తున్నా. సినిమాలో నేను ఎవరితో అయితే దురుసుగా ప్రవర్తిస్తున్నానో..వాళ్లతో కలిసి షూట్ అయ్యాక కలిసి భోజనం చేస్తున్నా. అంతా సవ్యంగానే ఉంటుంది. అది కేవలం పాత్ర మాత్రమేనని గ్రహించాను. ఇందులో నా పాత్రని విలన్ గా భావించలేదు. కుటుంబాన్ని అతిగా ప్రేమిచే వ్యక్తిగా భావించా. తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే మనవడి పాత్ర మాత్రమే చేసాను 'అని అన్నారు.