సితార నాన్న కూచీ..స్కూల్ బంక్!
డాడ్ తో ఉంటే సమయం తెలియదని...డే అండ్ నైట్ తెలియకుండానే అయిపోతుంది. ఎక్కువగా స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండేది నాన్న ఇంట్లో ఉన్నప్పుడే అంది.
పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో గారం. కానీ ఇంట్లో తల్లి అంటేనో..తండ్రి అంటేనో ఓ భయం అనేది ఉంటుంది. మరి సితార ఇంట్లో ఎవరికి భయపడుతుంది? ఎవరు సితారని ముద్దు చేస్తారు? సీతా పాప మమ్మీ కూచీనా? డాడీ కూచీనా? అంటే ....సితార డాడ్ పేరు చెప్పింది. డాడ్ తో సమయం గడపడం కోసం స్కూల్ కి సైతం బంక్ కొడుతుందిట. డాడ్ తో సమయం గడపడం అంటే ఎంతో ఇష్టమట.
డాడ్ తో ఉంటే సమయం తెలియదని...డే అండ్ నైట్ తెలియకుండానే అయిపోతుంది. ఎక్కువగా స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండేది నాన్న ఇంట్లో ఉన్నప్పుడే అంది. ఆ సమయంలో మహేష్ కూడా స్కూల్ బంక్ కొడుతున్నావ్ అని అడగరట. కొట్టడం అన్నదే నాన్నకి తెలియదంటోంది. కానీ మమ్మి మాత్రం అలా కాదంటోంది. అమ్మ అంటే కొంచెం భయం. అన్ని పనులు తనే చేసుకుంటుంది.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రివరకూ. ఆ మాత్రం కోపం సహజం అంటోంది. అమ్మని అర్దం చేసుకుంటుందిట. అయితే కోపం వస్తే మాత్రం అప్పుడప్పుడు పడతాయి. తాను అనుసరిస్తోన్న ఫ్యాషన్ ట్రెండ్ అంతా మమ్మీ నుంచి నేర్చుకున్నదే అంటోంది సితార. ఫ్యాషన్ పరంగా ఎలాంటి ఎంపికలు ఉండాలి. ఎలా రెడీ అవ్వాలి? అన్నది నమ్రతనే చూసుకుంటుందిట. చిన్నప్పుడు అన్ని పనులు తనే చేసేది.
ఇప్పుడు తానే అన్నీ చేసుకుంటున్నానని తెలిపింది. అలా సితార అమ్మ-నాన్నల ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ఇక సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఫోటోలు..వీడియోలు పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటుంది. ఇప్పటికే ఓ బంగారు నగల దుకాణానికి సంబంధించిన ప్రకటన కూడా చేసిన సంగతి తెలిసిందే.