అప్పులతో కుప్పకూలాక కోలుకున్న నిర్మాత
ఇటీవల హిందీ అగ్ర నిర్మాత బోనీకపూర్ తన కుమార్తెలను సౌత్ లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే
ఇటీవల హిందీ అగ్ర నిర్మాత బోనీకపూర్ తన కుమార్తెలను సౌత్ లో ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇప్పటికే రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన దేవర, చరణ్ సరసన బుచ్చిబాబు చిత్రంలోను నటిస్తోంది. దేవర 2లోను నటిస్తుంది. ఇదిలా ఉండగానే ఖుషీ కపూర్ ని కూడా జాన్వీ బాటలోనే హిందీకి పరిచయం చేసి సౌత్ లో దించాలనేది బోనీ ప్లాన్.
ఇకపోతే బోనీ పట్టిందల్లా బంగారంగా మారుతోంది. ఓవైపు ఎదిగొచ్చిన కుమార్తెలు తనకు బోలెడంత డబ్బు సంపాదించి పెట్టుబడులుగా అందిస్తున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో బోనీ కపూర్ తమ చిన్నతనంలో వారి కుటుంబ ఆర్థిక కష్టాల గురించి కొన్ని విషయాలు చెప్పారు. అతడు తన తండ్రి సురీందర్ కపూర్ ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకున్నారు. సురీందర్ కపూర్ కార్మికుల హక్కుల కోసం యజమానులకు ఎదురొడ్డి నిలబడటంతో పది ఉద్యోగాలు కోల్పోయాడు. పృథ్వీరాజ్ కపూర్ కారణంగా వారంతా ముంబైకి మకాం మార్చారు.
మా నాన్న పృథ్వీరాజ్ కపూర్‌తో కలిసి బొంబాయికి వచ్చారు. దాదాపు 10-12 ఉద్యోగాలు కోల్పోయిన కారణంగా మా తాత మా నాన్నను పృథ్వీరాజ్ జీకి అప్పగించారు. కార్మికులకు సంఘీభావం .. వారి కోసం ఆయన చేసిన వాదన కారణంగా అతడు బహిష్కరణను ఎదుర్కొన్నాడు. అతడు సవాల్ సమయంలో పని చేయకూడదనే కుటుంబం నిర్ణయించింది. మా అమ్మమ్మ మరణించిన తర్వాత, అనిల్ - నేను నటించాలని అనుకున్నాం. నేను ప్రొడక్షన్ చూసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఇంట్లో ఎవరో ఒకరు పనులు నిర్వహించాలి. మా నాన్న గుండె పరిస్థితి అంతంత మాత్రమే. ఒత్తిడిని మేనేజ్ చేయలేదు. బోనీ తన తండ్రి వివాహం తర్వాత జీవన స్థితి గురించి వెల్లడించాడు. ఆ కుటుంబమంతా రాజ్ కపూర్ అవుట్‌హౌస్‌లో ఉండేవారు. ఇది సాధారణంగా కపూర్ ఇంట్లో సహాయం కోసం ఉద్దేశించిన ఇల్లు.
బోనీ తన ప్రారంభ కెరీర్ లో సవాల్‌గా ఉన్న కాలాన్ని గుర్తుచేసుకున్నాడు. తన తండ్రి నిర్మిస్తున్న సినిమాల దర్శకులలో ఒకరి మరణంతో అప్పులయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మరింతగా అప్పుకు దారి తీసింది. అనంతరం ఎన్నో కష్టనష్టాలు చూసిన తర్వాత ఒక దారిన పడ్డారు. బోనీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. అజయ్ దేవగన్ , ప్రియమణితో ఆయన చేసిన మైదాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.31.86 కోట్లు వసూలు చేసింది.